Begin typing your search above and press return to search.
దిశ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన జడ్పీ చైర్ పర్సన్
By: Tupaki Desk | 11 Dec 2019 11:08 AM GMTదిశ హత్యోదంతం దేశవ్యాప్తంగా అందరినీ కదిలించింది.. నిరసనలు చేసేలా ఉసిగొల్పింది. మహిళలంతా రోడ్డెక్కిన పరిస్థితిని మనం చూశాం. అయితే స్వయంగా ఒక మహిళా ప్రజా ప్రతినిధి అయ్యిండి కూడా దిశపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది కామారెడ్డి జడ్పీ చైర్ పర్సన్ శోభ. ఇప్పుడు ఆమె చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
కామారెడ్డి జడ్పీ చైర్ పర్సన్ శోభ మాట్లాడుతూ దిశ తన తల్లి దండ్రులతో సఖ్యతగా లేదేమోనని అనిపిస్తోందని.. నిందితులు అడ్డుకున్నప్పుడు తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పే ధైర్యం లేక తన చెల్లెలికి ఫోన్ చేసిందని ఆమె నోరు జారారు. చెల్లెలుకు కాకుండా తండ్రికి ఫోన్ చేసి ఉంటే ఆయన వచ్చి తీసుకెళ్లేవారని ఆమె అన్నారు. గెజిటెడ్ అధికారిగా ఉన్న దిశకు ఎవరికి ఫోన్ చేయాలో కూడా తెలియదా అని చైర్ పర్సన్ శోభ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
దిశ నిర్లక్ష్యం వల్లే ఈ దారుణం జరిగిందని.. ప్రభుత్వం మాత్రం ఎంతమందిని రక్షిస్తుందని చైర్ పర్సన్ శోభ అన్నారు. దిశ ఘటన తో రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ఆమె అన్నారు.
దిశ ఘటనను ఉదహరిస్తూ ఏకంగా జిల్లా పరిషత్ సమావేశంలో చైర్ పర్సన్ శోభ చేసిన ఈ కామెంట్స్ వివాదాస్పదమయ్యాయి. ఆ మహిళా ప్రతినిధి అయ్యిండి దిశకు వ్యతిరేకంగా మాట్లాడిన తీరు దుమారం రేపుతోంది.