Begin typing your search above and press return to search.
చంద్రబాబు, జగన్ లలో విలనెవరు? హీరో ఎవరు?
By: Tupaki Desk | 15 Jun 2016 11:26 AM GMT విజయవాడలో వైసీపీ నిర్వహించిన ఆ పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఒకింత సక్సెస్ అయిందనే రాజకీయవర్గాలు అంటున్నాయి. అయితే... ఈ సమావేశంలో నేతలు చేసిన ప్రసంగాల దెబ్బకు వైసీపీ - టీడీపీల మధ్య మళ్లీ మాటల యుద్ధం పెరుగుతోంది. హీరోలు - విలన్లు అంటూ పాత కథలు తవ్వుకుంటూ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. నిన్న విస్తృత స్థాయి సమావేశం అనంతరం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడిని తెలుగు సినిమాల్లోని విలన్ గా అభివర్ణించిన విషయం తెలిసిందే. జగన్ వ్యాఖ్యలపై తాజాగా టీడీపీ నేత ఆనం రాంనారాయణ రెడ్డి విరుచుకుపడ్డారు. హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘24 రీళ్లు పూర్తయినా జగన్ కు సినిమా అర్థం కాదు’ అని ఎద్దేవా చేశారు. ‘జగనే రాష్ట్రానికి అసలైన విలన్’ ఆరోపించారు.
జగన్ వ్యవహారశైలిపై విరుచుకుపడిన ఆనం... ‘జగన్ హావభావాలు చూస్తే విలనే గుర్తుకొస్తార’ని అన్నారు. జగన్ ఎప్పటికీ హీరో కాలేరని... అలాంటివన్నీ కలలుగానే మిగిలిపోతాయని అన్నారు. చంద్రబాబే అసలైన హీరో అని ఆనం వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో జగన్‌కి పతనం తప్పదని జోస్యం చెప్పారు.
మరోవైపు వైసీపీ నేతలు చంద్రబాబును విలన్ అనడం ఇంకా ఆపలేదు. తాజాగా ఆ పార్టీ నేత భూమన కరుణాకర్ రెడ్డి కూడా చంద్రబాబు పెద్ద విలన్ అంటూ విమర్శలు కురిపించారు. చంద్రబాబు మొదటి రీల్లోనే ఎన్టీఆర్ ను మోసం చేశారని.. ఎన్టీఆర్ విషయంలోనే బాబు విలనిజం బయట పడిందని ఆయన ఎద్దేవా చేశారు. ‘జగన్ పై వ్యక్తిగత దాడి చేయడమే తప్పా మీరు చెప్పుకునేందుకు ఏవైనా అభివృద్ధి పనులు చేశారా..?’ అని ఆయన చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. జగన్ పై వ్యక్తిగత దాడులకే ప్రభుత్వ నేతలు పరిమితం అవుతున్నారని ఆయన విమర్శించారు. మొత్తానికి రెండు పార్టీల నేతలు రీళ్లు - సినిమాలు - హీరోలు - విలన్లు అంటూ రాజకీయాలను సినిమాటిక్ గా మార్చేస్తున్నారు. ఇంతకీ జగన్ - చంద్రబాబుల్లో విలనెవరో హీరో ఎవరో ప్రజలే చెప్పాలి.