Begin typing your search above and press return to search.
చంద్రుళ్లు ఇప్పుడైనా కలుస్తారా?
By: Tupaki Desk | 31 July 2015 8:55 AM GMTఅక్కడెక్కడో సిరియా అంట.. అక్కడ ఇస్లామిక్ స్టేట్ అనే రాక్షసుల్లాంటి తీవ్రవాదులు ఉంటారని చెప్పుకునే రోజులు పోయినట్లే. ఎందుకంటే.. అక్కడెక్కడో ఉండే ఐఎస్ రాక్షసులు ఇప్పడు తెలుగోడి గుండె మీద కూర్చున్నాడు. లిబియాలో పాఠాలు చెప్పుకునే ఉపాధ్యాయుల్ని పట్టుకెళ్లారు.
యమదూతలకు ఏమైనా కనికరం ఉంటుందేమో కానీ.. ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదులకు అలాంటివి మచ్చుకు కూడా ఉండవు. అందులోకి.. భారత్ దేశం పట్ల రగిలిపోతున్న వారు.. తమ ఆగ్రహాన్ని ప్రదర్శించేందుకే నలుగురు భారతీయుల్ని కిడ్నాప్ చేసినట్లు అర్థమవుతోంది. వీరిలో ఇద్దరు తెలుగు వారు ఉండటం యాదృశ్చికం.
అందులోనూ ఒకరు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వ్యక్తి.. మరొకరు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు. ఇద్దరు తెలుగువారిని ఐఎస్ తీవ్రవాదులు పట్టుకున్న నేపథ్యంలో.. వారి రక్షణ బాధ్యతను ఇద్దరు ముఖ్యమంత్రులు తీసుకోవాల్సిన అవసరం. ఇద్దరు చంద్రుళ్లు గతంలో ఒక విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించేవారు. తమ రాష్ట్రానికి చెందిన వారు ఎక్కడ ఇబ్బంది పడకుండా చూసుకుంటామని వ్యాఖ్యానించేవారు.
ఇప్పుడు కలలో కూడా ఊహించని సంఘటన జరిగింది. వాస్తవానికి తాజా వ్యవహారం ముఖ్యమంత్రుల స్థాయికి మించింది. దేశస్థాయిలో పావులు కదపాల్సిన పరిస్థితి. ఎవరో ఒకరు ఏదో చేస్తారన్న వైఖరిని వదిలిపెట్టి.. ఎవరికి వారు తమ వ్యక్తిగత హోదాలో ప్రయత్నాలు చేయాల్సిన సమయం ఆసన్నమైంది.
అక్కడెక్కడో ఉన్న తెలుగువాడు అపాయంలో చిక్కుకున్న నేపథ్యంలో.. ఇద్దరు చంద్రుళ్లు ఒక్కటి (ముఖాముఖిన కలవకున్నా) అన్నట్లుగా కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి.. కిడ్నాప్ అయిన వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చేలా చేస్తారా?