Begin typing your search above and press return to search.
కరోనా అప్డేట్: ఏపీలో కొత్తగా 50 కేసులు
By: Tupaki Desk | 10 May 2020 6:09 AM GMTఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 8666 మంది శాంపిల్స్ ను వైద్యులు పరీక్షించగా.. 50 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ లో పేర్కొంది.
దీంతో ఇప్పటివరకు ఏపీలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 1980కి చేరింది. రెండు వేల కేసులకు చేరువైంది. ప్రధానంగా గడిచిన 24 గంటల్లో 38మంది కరోనా నుంచి కొలుకొని డిశ్చార్జ్ అయ్యారు. కర్నూలులో అత్యధికంగా 21 మంది డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో మొత్తం డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 925కి చేరింది.
కరోనాతో గడిచిన 24 గంటల్లో కర్నూలు జిల్లాలో ఒక్కరు మరణించారు. దీంతో ఏపీ వ్యాప్తంగా కరోనా మృతుల సంఖ్య 45కు చేరింది. ఇప్పటివరకు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న ప్రస్తుతం ఏపీలో 1010మంది చికిత్స పొందుతున్నారు.
తెలంగాణలో కరోనా బాధితుల సంఖ్య పెరిగింది. నిన్న కొత్తగా 31 కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1163కి చేరింది. మొత్తం ఇప్పటిదాకా 30 మంది ప్రాణాలు కోల్పోయారు.
భారత్ లో కరోనా మహమ్మారి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. దేశవ్యాప్తంగా సరాసరి ప్రతీరోజు 3వేల కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. 100 మరణాలు దేశవ్యాప్తంగా సంభవిస్తున్నాయి. శనివారం ఒక్కరోజే దేశంలో 3277 కేసులు నమోదయ్యాయి. 128మంది ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం ఉదయానికి దేశంలో కరోనా మృతుల సంఖ్య 2109కి చేరింది. మొత్తం దేశంలో కేసుల సంఖ్య 62939గా నమోదైంది. ఇప్పటివరకు 19358 మంది కోలుకున్నారు. మరో 41472 మంది చికిత్స పొందుతున్నారు.
దీంతో ఇప్పటివరకు ఏపీలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 1980కి చేరింది. రెండు వేల కేసులకు చేరువైంది. ప్రధానంగా గడిచిన 24 గంటల్లో 38మంది కరోనా నుంచి కొలుకొని డిశ్చార్జ్ అయ్యారు. కర్నూలులో అత్యధికంగా 21 మంది డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో మొత్తం డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 925కి చేరింది.
కరోనాతో గడిచిన 24 గంటల్లో కర్నూలు జిల్లాలో ఒక్కరు మరణించారు. దీంతో ఏపీ వ్యాప్తంగా కరోనా మృతుల సంఖ్య 45కు చేరింది. ఇప్పటివరకు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న ప్రస్తుతం ఏపీలో 1010మంది చికిత్స పొందుతున్నారు.
*తెలంగాణలో పెరిగిన కరోనా
* భారత్ లో 2వేలు దాటిన కరోనా మరణాలు