Begin typing your search above and press return to search.
దిశ ఉదంతంతో ఆ మాటలే ప్రజల్ని అంతలా కనెక్ట్ చేసింది?
By: Tupaki Desk | 7 Dec 2019 5:22 AM GMTదేశంలో నిత్యం ఎన్నోఅత్యాచారాలు.. హత్యాచారాలు.. హత్యలు చోటు చేసుకుంటూ ఉంటాయి. కానీ.. కొన్నింటి విషయంలో ప్రజలు విపరీతంగా కనెక్ట్ అవుతారు. వెటర్నరీ వైద్యురాలు దిశ ఉదంతంలో జరిగింది కూడా ఇదే. తమ ఇంట్లో వారికి జరిగిన నష్టంగా ప్రజలు ఫీల్ కావటం.. విపరీతమైన వేదనకు గురి కావటం కనిపించింది. ఇంతటి భావోద్వేగం కూడా నిందితుల ఎన్ కౌంటర్ కు కారణమని చెప్పేటోళ్లు కూడా ఉన్నారు.
ఇంతకీ.. దిశ ఘటన ప్రజల్ని అంతలా కనెక్ట్ అయ్యేలా చేయటానికి కారణం ఏమిటన్న విషయంలోకి వెళితే.. చాలామంది నోట వినిపిస్తున్న మాట.. బాధితురాలు చివర్లో తన సోదరితో మాట్లాడిన ఆడియో క్లిప్ బయటకు రావటమేనని చెబుతున్నారు. ఆరు నిమిషాలకు కాస్త ఎక్కువగా ఉండే ఈ ఆడియో క్లిప్ విడుదలై.. చాలా తక్కువ సమయంలో విపరీతంగా వైరల్ అయ్యింది.
పాశవిక చర్యతో కూడుకున్న ఈ ఉదంతానికి సంబంధించిన సజీవ సాక్ష్యం.. నేరం జరగటానికి కొద్ది క్షణాల ముందు బాధితురాలు మాట్లాడిన మాటలు కావటంతో అందరూ ఈ ఉదంతంతో కనెక్ట్ అయ్యారు. దెయ్యాల్లా ఉన్నారే.. భయమేస్తోంది పాపా అంటూ తన సోదరితో దిశ మాట్లాడటం.. తనతో ఐదు నిమిషాలు మాట్లాడాలంటూ కోరటం అందరిని కదిలించి వేసింది. ఒక నిస్సహాయ మహిల దారుణ రీతిలో బలి కావటం అందరిని కన్నీళ్లు పెట్టేలా చేసింది.
ఒక సాధారణ ఆడపిల్లకు ఇంతటి దారుణ పరిస్థితి ఎదురైందా?అన్న ఆక్రోశంతో విపరీతమైన ఆవేశం పుట్టుకొచ్చిందన్న మాట పలువురి నోటి వెంట వినిపిస్తోంది. అన్ని వర్గాల్లో చర్చకు తెర తీయటంతో పాటు.. దేశ వ్యాప్తంగా సంచలనంగా మారి.. చివరకు పార్లమెంటులోనూ ఇదే అంశంపై చర్చకు కారణం.. దిశ మాట్లాడిన ఆఖరి ఫోన్ కాల్ క్లిప్ గా చెప్పాలి. ఇంతటి సంచలనానికి సదరు ఆడియో క్లిప్ కారణమని చెప్పక తప్పదు.