Begin typing your search above and press return to search.
లైవ్ లో మాట్లాడుతూ పర్వతం పై నుండి పడ్డాడు!!
By: Tupaki Desk | 1 Nov 2019 10:07 AM GMTమనం ఏదైనా పని చేసేటప్పుడు దాని మీద మాత్రమే ద్యాస పెట్టాలి ..ఆలా కాకుండా పక్కన ఏమి జరుగుతుందో చూడాలి అనుకుంటే చివరికి అది ఏటో వెళ్లిపోతుంది ..ఆ తరువాత ఆ విషయం పై ఎంతగా మాట్లాడుకున్న పెద్దగా ప్రయోజనం ఉండదు. అందుకే పెద్దలు - గురువులు ఏదైనా పని చేసేటప్పుడు ఏకాగ్రతతో చేయమంటారు. పర్వతం ఎక్కాలి అనుకుంటే దానిమీదే ద్యాస పెట్టి ఎక్కాలి కానీ యూట్యూబ్ లైవ్ పెట్టి అక్కడి పరిస్థితులని ఎవరు చెప్పామన్నారు. పైకి ఎక్కి తిరిగి వచ్చాక ఎన్ని వీడియో లైన చేసుకోవచ్చు. కానీ - పర్వతం ఎక్కుతూ లైవ్ లో మాట్లాడుతూ ..ఏకాగ్రత కోల్పోవడం తో ప్రాణాలని కోల్పోయాడు. ఈ సంఘటన జపాన్ లో జరిగింది. జపాన్ లోని ఎత్తైన పర్వత శిఖరం మౌంట్ ఫుజీ ని అధిరోహించేందుకు వెళ్లిన ఓ గుర్తుతెలియని వ్యక్తి.. యూట్యూబ్ లో లైవ్ ఇస్తూ చనిపోయాడు.
మరణానికి కొన్ని నిమిషాల ముందు అతడు పర్వత శిఖరం మీదకు ఎక్కుతూ.. అక్కడి ప్రతికూల పరిస్థితుల గురించి చెప్పడం ఈ వీడియోలో కనిపించింది. ఈ పర్వతం మీద కాలు జారుతోంది. ఇది చాలా ప్రమాదకరంగా ఉంది. అవిగో అక్కడ రాళ్లు ఉన్నాయి. వాటి ఆధారంగా ముందుకు వెళ్దాం. ఇది చాలా ప్రమాదకరంగా ఉంది. కిందికి జారిపోతానేమో అనిపిస్తోంది అని అన్నాడు. నేను సరైన దారిలోనే ఉన్నానా - నేను జారిపోతున్నా అంటూ ఒక్కసారిగా కిందపడిపోయాడు. అతడితోపాటే ఆ కెమేరా కూడ గిరగిరా తిరుగుతూ ఆగిపోయింది.
యూట్యూబ్ లైవ్ లో ఈ ప్రమాదాన్ని చూసిన వ్యూవర్స్ వెంటనే ఈ విషయం గురించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో రెస్క్యూ సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకుని బాధితుడి కోసం అన్వేషించారు. చివరికి పర్వతం లోయలో అతడి మృతదేహం కనిపించింది. అయితే - ఆ వ్యక్తి ఎవరినేది ఇంకా తెలియరాలేదు. ఏటా వందలాది మంది ఫుజీ పర్వతాన్ని అధిరోహిస్తారు. జపాన్ లోని దీన్ని పవిత్ర పర్వతంగా భావిస్తారు. ఏటా జులై - ఆగస్టు నెలల్లో మాత్రమే ఈ పర్వతం మీదకు అనుమతి ఇస్తారు. మిగతా రోజుల్లో పర్వతం పరిసర ప్రాంతాల్లోని హోటళ్లు - టాయిలెట్లను మూసివేస్తారు.