Begin typing your search above and press return to search.

ఏపీలో వైయస్సార్ జయంతి నాడు కొత్త కార్యక్రమానికి శ్రీకారం !

By:  Tupaki Desk   |   27 March 2021 10:33 AM GMT
ఏపీలో వైయస్సార్ జయంతి నాడు కొత్త కార్యక్రమానికి శ్రీకారం !
X
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తమ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ, అలాగే ఎన్నికల ప్రచార సమయంలో ఇవ్వని హామీలను కూడా చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న జగన్ సర్కార్ కి ప్రజలు తాజాగా జరిగిన స్థానిక ఎన్నికలలో నీరాజనాలు పట్టారు. తిరుగులేని పార్టీగా వైసిపి దూసుకు పోతూ ఉండగా ,ఎదురులేని రాజకీయ నేతగా , జననేతగా జగన్ దూకుడు ఆలోచనలు చేస్తూ ఉన్నారు. ప్రతి విషయంలో ప్రజలకు మేలు చేసే రీతిలో ఆలోచన చేస్తున్న జగన్ సర్కార్ తాజాగా వైయస్సార్ జయంతి నాడు రాష్ట్రంలో సరికొత్త కార్యక్రమం ప్రారంభించడానికి సిద్ధం అయింది.

పల్లె సీమలే దేశానికి పట్టుకొమ్మలు అని నమ్మిన జగన్ సర్కార్ గ్రామ సచివాలయ వ్యవస్థ ను ఏర్పాటు చేసి, గ్రామాలలోని ప్రజలకు ప్రభుత్వం అందించే పథకాలు, వివిధ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అందేలా చూస్తుంది. ఇక ఇదే సమయంలో తాజాగా రాష్ట్రంలోని గ్రామాల పరిశుభ్రత లక్ష్యంగా జగన్ సర్కారు భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని గ్రామాలలో అన్నింటినీ స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దాలని సంకల్పించిన రాష్ట్రప్రభుత్వం ఇందులో భాగంగా పట్టణ ప్రాంతాల తరహాలో, గ్రామాలలో కూడా ఇళ్ళ నుండి చెత్త సేకరణతో పాటు, రోడ్లు ఊడ్చే పనుల నిర్వహణ ప్రతినిత్యం చేపట్టనుంది. జూలై 8 వ తారీకు నుంచి జగనన్న స్వచ్ఛ సంకల్పం అనే కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ఏపీ ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.

ఈ కార్యక్రమం ద్వారా గ్రామాల పరిశుభ్రత లక్ష్యంగా..వంద రోజుల పాటు జరపాలని ఇంటినుండి చెత్తను సేకరించి, గ్రామాల్లో రోడ్లను పరిశుభ్రంగా ఉంచడానికి జగన్ సర్కార్ ఆలోచన చేసింది. దీంతో జూలై 8 వ తారీకు వైయస్ఆర్ జయంతి నాడు ఏపీలో అన్ని గ్రామాల్లో ప్రజా ప్రతినిధుల సమక్షంలో ఈ పరిశుభ్రత కార్యక్రమాలు జరగనున్నాయి. గ్రామాలను స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దడం కోసం ఏప్రిల్ 7 నుండి అన్ని గ్రామాలలో సన్నాహక కార్యక్రమాలు మొదలు పెట్టనున్నారు. స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దడంలో ప్రజలను కూడా భాగస్వామ్యం చేయాలని నిర్ణయించారు. ప్రజల భాగస్వామ్యం లేకుండా ఏదీ సాధ్యం కాదని భావిస్తున్న నేపథ్యంలోనే ప్రజలను సైతం భాగస్వాములుగా చేయడానికి పంచాయితీ రాజ్ శాఖ అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఈ వంద రోజులు కార్యక్రమానికి అయ్యే ఖర్చును పంచాయతీరాజ్ శాఖ నిధుల నుంచి ఖర్చు చేస్తారు.