Begin typing your search above and press return to search.
నిర్భయ దోషులకు ఉరి సన్నాహల్లో బిజీ గా ఉన్న తీహార్ జైలు అధికారులు...
By: Tupaki Desk | 8 Jan 2020 9:34 AM GMTనిర్భయ కేసు లో నలుగురు దోషులకు ఉరి తీసే తేదీ ఖరారు కావడంతో, ఆ తేదీకి ముందే మాక్ ఉరి కార్యక్రమం చేపట్టేందుకు తీహార్ జైలు అధికారులు బుధవారం నుంచి సన్నాహాలు చేస్తున్నారు.దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయపై సామూహిక అత్యాచారం, హత్య కేసులో నలుగురు దోషులకూ జనవరి 22వ తేదీ ఉదయం 7 గంటలకు తీహార్ జైలులో చనిపోయే వరకూ వారిని ఉరి తీయాలని పటియాలా హౌస్ కోర్టు ఆదేశాలుజారీ చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు దోషులు ముఖేశ్ , పవన్ గుప్తా, వినయ్ శర్మ, అక్షయ్ కుమార్ లకు అదనపు సెషన్స్ జడ్జి సతీశ్ కుమార్ అరోరా డెత్ వారెంట్లు జారీ చేశారు.
ఇక, తీహార్ జైలు లోని 3వ నంబరు జైలు గదిలో నిర్భయ కేసులో దోషులకు మాక్ ఉరి కార్యక్రమం చేపట్టనున్నట్లు జైలు సూపరింటెండెంట్ చెప్పారు. మాక్ ఉరి కార్యక్రమం సందర్భంగా పీడబ్ల్యూడీ కార్య నిర్వాహక ఇంజినీరు తోపాటు జైలు అధికారులు హాజరై పర్య వేక్షిస్తారని జైలు సూపరింటెండెంట్ చెప్పారు.పార్లమెంటు పై దాడి కేసులో నిందితుడైన అఫ్జల్ గురును ఉరి తీసిన 3వనంబరు తీహార్ జైలు గదిలోనే నిర్భయ దోషులు నలుగురికి 22 వతేదీ ఉదయం 7 గంటలకు ఒకేసారి ఉరి తీయ బోతున్నారు.
ఇప్పటికే ఉరి తీసే తలారీని ఉత్తరప్రదేశ్ జైళ్ల శాఖ నుంచి ఢిల్లీకి రప్పించారు. తీహార్ జైలులో ఈ నెల 22 వ తేదీకి ముందే నిర్భయ దోషులకు మాక్ ఉరి కార్యక్రమం చేపట్టనున్నట్లు జైలు అధికారులు వివరించారు. నిర్భయ దోషులకు డెత్ వారంట్ జారీ చేయడంతో తీహార్ జైలు అధికారులు ఉరి తీసే ఏర్పాట్ల లో మునిగి పోయారు. అలాగే బాక్సర్ నుండి ఉరి తాళ్లని కూడా ఇప్పటికే తెప్పించారు.