Begin typing your search above and press return to search.
వైసీపీకి, పోలీసులకు పయ్యావుల పంచ్ లు
By: Tupaki Desk | 25 April 2022 3:30 PM GMTఒక నేతకు అవసరమైన అన్ని గుణాలు పయ్యావుల కేశవ్ సొంతమని చెప్పాలి. కానీ.. ఆయన బ్యాడ్ లక్ ఏమంటే.. గడిచిన పదమూడేళ్లలో ఆయన ఇమేజ్ కు తగ్గట్లు అవకాశాలు రాని పరిస్థితి. ప్రస్తుతం ఉరవకొండ టీడీపీ ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్న ఆయన.. తాజాగా సంచలన అంశాల్ని బయటకు వెల్లడించారు.
ఉమ్మడి అనంత జిల్లాలో జరుగుతున్న సరికొత్త దందా గురించి బయటపెట్టి షాకిచ్చారు. కొందరు పోలీసుల నిర్వాకం ఆ వ్యవస్థ మీద ఉన్న గౌరవ మర్యాదల్ని దెబ్బ తీసేలా ఉండటమే కాదు.. సిగ్గుతో తల దించుకునేలా ఉందంటూ పయ్యావుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వైసీపీ విపక్షంలో ఉన్నప్పుడు రిలయన్స్ మార్టుకు నిప్పు పెట్టి.. దోపిడీ చేసినట్లుగా ఎర్రి స్వామిరెడ్డి.. విశ్వేశ్వర రెడ్డిలపై అప్పట్లో సీఐగా వ్యవహరిస్తున్న నరసింగప్ప ఎఫ్ఐఆర్ నమోదు చేశారని.. ప్రస్తుతం డీఎస్పీ స్థానంలో ఉన్న సదరు పోలీసు అధికారి ఒకప్పటి నిందితులతో సన్మానం చేయించుకోవటం దేనికి నిదర్శనం? అంటూ ప్రశ్నించారు. ఈ సందర్భంగా వైసీపీ మంత్రి కాకాణి గోవర్ధనరెడ్డికి చురకలు వేశారు.
‘మంత్రి కాకాణికి తెలీకపోవటంతో కష్టపడుతున్నారు. ఇక్కడ కొందరు పోలీసు అధికారులు.. అధికార పార్టీ నేతలంతా కలిసిపోయారు.తమపై కేసులు పెట్టిన అధికారులకు నిందితులే పోస్టింగులు ఇప్పిస్తున్నారు. తామంతా కలిసిపోయినట్లుగా వేదికల ద్వారా వెల్లడిస్తున్నారు. ఇలాంటి టెక్నిక్ లు తెలీక కోర్టుల్లోకి పోయి డాక్యుమెంట్లను కాకాణి కొట్టేస్తున్నారు’’ అంటూ ఎద్దేవా చేశారు. ప్రజల రక్షనణ కోసం ఉన్నామన్న విషయాన్ని పోలీసులు గుర్తుంచుకోవాలన్నారు. పోలీస్ స్టేషన్లకువెళ్లిన అధికార పార్టీ నేతలు.. అక్కడే కూర్చుండి ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసుల్ని బనాయిస్తున్నారన్నారు.
ఉరవకొండ వైసీపీ నేత పుట్టిన రోజును పురస్కరించుకొని పోలీసులు శుభాకాంక్షల ఫ్లెక్సీల్ని ఏర్పాటు చేస్తున్నారని.. దీనికి పోలీసులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తాను చేసిన ఆరోపణలో నిజం కాకుంటే వివరణ ఇవ్వాలన్నారు.
ఫ్లెక్సీలో ఒక పార్టీ నేత కాళ్ల కింద పోలీసుల ఫోటోలు వేయటాన్ని ఆయన తీవ్రంగా తప్పు పట్టారు. నిందితులతో కొందరు అధికారులు వ్యవహరిస్తున్న తీరుతో పోలీస్ శాఖకే చెడ్డపేరు వస్తోందని వేదన వ్యక్తం చేశారు. పయ్యావుల వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.