Begin typing your search above and press return to search.
సీఎం పదవి అంటే..‘రామ్.. రామ్’ అంటున్నాడు
By: Tupaki Desk | 15 March 2017 4:40 AM GMTబంపర్ మెజార్టీతో యూపీ కోటను సొంతం చేసుకున్న కమలనాథులు ఇప్పుడు.. ఆ కోటకు రాజును వెతికే ప్రయత్నంలో మహా బిజీగా ఉన్నారు.యూపీ పీఠం గెలిస్తే చాలన్నట్లుగా వ్యవహరించి..అందుకు తగ్గట్లే పావులు కదిపిన వారు.. వారు కలలో కూడా ఊహించనిరీతిలో బంపర్ మెజార్టీని సొంతం చేసుకోవటంతో ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే..యూపీ కోటకు కాబోయే రాజు ఎవరన్న విషయంపై అంతకంతకూ పీటముడులు పడుతున్నాయే కానీ.. పరిష్కారం మాత్రం ఒక పట్టాన లభించటం లేదు.
ముఖ్యమంత్రి సీట్లో కూర్చోవటానికి రేసులో ఉన్నట్లు చెబుతున్నవారిలో అందరి కంటే ఎక్కువగా వినిపిస్తున్న పేరు కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్. అయితే.. ఆయన మాత్రం యూపీ సీఎం పోస్టు ను తీసుకునే విషయంలో అస్సలు ఆసక్తిని ప్రదర్శించటం లేదని చెబుతున్నారు. మరో వైపు.. గోవా ముఖ్యమంత్రి పదవి కోసం మనోహర్ పారీకర్ రాష్ట్రానికి వెళ్లిపోయిన నేపథ్యంలో.. మరో సీనియర్ మంత్రిని ఢిల్లీ నుంచి రాష్ట్రానికి పంపటానికి మోడీ సుముఖతతో ఉండకపోవచ్చన్న వాదన వినిపిస్తోంది.
ఇందుకు తగ్గట్లే యూపీ రాష్ట్ర పంచాయితీలోకి వెళ్లేందుకు రాజ్ నాథ్ ఏ మాత్రం ఇష్టం చూపించటం లేదని చెబుతున్నారు. యూపీ సీఎం పదవిని చేపట్టే విషయంపై ఆయన్ను మీడియా ప్రశ్నించగా.. స్పందించేందుకు ఇష్టపడని రాజ్ నాథ్ ముక్తసరిగా.. ‘‘రామ్..రామ్’’ అంటూ తనకే మాత్రం ఆసక్తి లేదన్న విషయాన్ని చెప్పే ప్రయత్నం చేశారు. అయితే ఇదంతా వ్యూహాత్మకంగా తీసుకున్ననిర్ణయమా? లేక నిజంగానే రాజ్ నాథ్ కు ఇష్టం లేదా?అన్నది ఇప్పడు ప్రశ్నగా మారింది.
మరోవైపు.. సీఎం పదవిని ఆశిస్తున్న నేతల్లో చూస్తే.. రాజ్ నాథ్ తర్వాత ప్రముఖంగా వినిపిస్తోన్నపేరు మనోజ్ సిన్హానే. పూర్వాంచల్ ప్రాంతానికి చెందిన ఆయన అగ్రకులమైన భూమిహార్ నేతగా సుపరిచితుడు. అగ్రనాయకత్వానికి సన్నిహితంగా ఉండే ఆయన్ను ఎంపిక చేసే అవకాశం ఉందన్న వాదన వినిపిస్తోంది. ఓబీసీని కానీ సీఎం పీఠం మీద కూర్చోబెట్టకూడదన్నదే బీజేపీ అధినాయకత్వ ఆలోచనే అయితే.. మనోజ్ సిన్హానే యూపీకి కాబోయే ముఖ్యమంత్రిగా చెబుతున్నారు.
యూపీ సీఎం రేసులో రాష్ట్రపార్టీ అధ్యక్షుడు కేశవ్ ప్రసాద్ మౌర్య.. ఫైర్ బ్రాండ్ ఎంపీ యోగి ఆదిత్యనాథ్.. లక్నో మేయర్..పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు దినేశ్ శర్మ.. జాతీయ అధికార ప్రతినిధి శ్రీకాంత్ శర్మ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఇవే కాదు..ఆర్ ఎస్ ఎస్ నేపథ్యం ఉన్న సురేశ్ ఖన్నా.. లాల్ బహదూర్ శాస్త్రి మనమడు సిద్ధార్థ్ నాథ్ సింగ్ పేర్లు తెర మీదకు వస్తున్నాయి. రోజులు గడుస్తున్న కొద్దీ.. సీఎం ఆశావాహుల పేర్లు అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/