Begin typing your search above and press return to search.

భార‌త్ ఆ బుడ్డ దేశంతో స‌మాన‌మా?

By:  Tupaki Desk   |   13 July 2017 4:04 PM GMT
భార‌త్ ఆ బుడ్డ దేశంతో స‌మాన‌మా?
X
అమెరికా క‌ల‌లు మ‌న దేశంలో ఎక్కువే. డాల‌ర్ డ్రీమ్స్ లో భాగంగా అగ్ర‌రాజ్యానికి వెళ్లే వారు.. అక్క‌డే సెటిల్ కావాల‌న్న క‌ల‌ల్ని కంటుంటారు. అమెరికాలో శాశ్విత నివాసం కోసం అప్లికేష‌న్ పెట్టుకునే వారికి అక్క‌డి ప్ర‌భుత్వం గ్రీన్ కార్డు ఇష్యూ చేస్తోంది. అయితే.. దీని కోసం ప‌న్నెండు సంవ‌త్స‌రాలు వెయిట్ చేయాల్సిన ప‌రిస్థితి.

ఇంత సుదీర్ఘ కాలం వెయిట్ చేసిన త‌ర్వాత మాత్ర‌మే అమెరికాలో ప‌ర్మినెంట్ గా సెటిల్ అయ్యే చాన్స్ ల‌భించే అవ‌కాశం ఉంటుంది. ఇటీవ‌ల దీనికి సంబంధించిన ఒక నివేదిక ఇదే విష‌యాన్ని వెల్ల‌డించింది. దీనిపై అధికార పార్టీకి చెందిన రిప‌బ్లిక‌న్ కాంగ్రెస్ నేత కెవిన్ యోద‌ర్ రియాక్ట్ అయ్యారు .

భార‌త్ లాంటి దేశానికి ఇంత సుదీర్ఘ కాలానికి గ్రీన్ కార్డు ఇవ్వ‌టం స‌రికాద‌న్న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు. గ్రీన్ లాండ్ చిన్న దేశానికి అమ‌లు చేసే రూల్స్‌ను భార‌త్ లాంటి పెద్ద దేశానికి అమ‌లు చేయ‌టం ఏమిట‌న్న విమ‌ర్శ‌ను ఆయ‌న వ్య‌క్తం చేశారు. చిన్న దేశాల‌తో స‌మానంగా అత్య‌ధిక జ‌నాభా ఉన్న దేశానికి ఉన్న వారికి గ్రీన్ కార్డులు మంజూరు చేయ‌టం స‌రికాద‌న్నారు.

దేశాల వారీగా ఇచ్చే గ్రీన్ కార్డు కోటా కూడా స‌రిగా లేద‌న్న ఆయ‌న‌.. ప్ర‌పంచ జ‌నాభాలో 40 శాతం జ‌నాభా ఉన్న భార‌త్‌..చైనా దేశాల‌కు ఉద్యోగ నిపుణుల‌కు.. గ్రీన్ లాండ్ లాంటి చిన్న దేశాల‌కు చెందిన అభ్య‌ర్థుల‌కు స‌మాన కోటాలో గ్రీన్ కార్డులు మంజూరు చేయ‌టం అన్యాయ‌మ‌న్నారు. నిబంధ‌న‌లు స‌రి చేసి.. ద‌ర‌ఖాస్తు చేసిన తేదీని అనుస‌రించి.. వారి నైపుణ్యమే ఆధారంగా గ్రీన్ కార్డు మంజూరు చేయాల‌న్న సూచ‌న చేశారు. భార‌త్‌.. చైనాల‌కు అనుకూలంగా స‌ద‌రు రిప‌బ్లిక‌న్ కాంగ్రెస్ నేత చేసిన సూచ‌న‌లు ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారాయి.