Begin typing your search above and press return to search.

ఆ దీన రైతుల కోసం ఢిల్లీ చేరిన విప‌క్ష నేత‌

By:  Tupaki Desk   |   1 April 2017 10:35 AM GMT
ఆ దీన రైతుల కోసం ఢిల్లీ చేరిన విప‌క్ష నేత‌
X
అనూహ్య రీతిలో క‌రువు, క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర ద‌క్క‌క‌పోవ‌డంతో దీన స్థితిలోకి చేరిన రైతుల దుస్థితి వివ‌రిస్తూ దేశ రాజధాని న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తోన్న తమిళనాడు రైతులకు ప్ర‌తిపక్ష నేత‌, డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ సంఘీభావం ప్రకటించారు. ఇవాళ ఆయన రైతుల వద్దకు వచ్చి సమస్యలను తెలుసుకుని మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా స్టాలిన్ మాట్లాడుతూ.. తమిళనాడు సీఎం పళనిస్వామిపై విమర్శలు సందించారు.

తమిళనాడు సీఎం జంతర్ మంతర్ వద్దకు వచ్చి రైతుల ఆవేదన చూడాలని అన్నారు. కానీ సీఎం పళనిస్వామికి అవేమీ ప‌ట్ట‌డం లేద‌ని మండిప‌డ్డారు. ఆర్‌ కే నగర్ ఉప ఎన్నికల్లో తీరకలేకుండా ఉన్నారని విమర్శించారు. రైతుల సమస్యలు ప‌ట్టించుకోనంత ముఖ్య‌మైన ప‌నులు ఏమీ ఉండ‌వ‌ని పేర్కొంటూ పళనిస్వామి జంతర్ మంతర్ వద్దకు వచ్చి రైతుల సమస్యలకు పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. తమిళనాడు రైతుల సమస్యలపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని అన్నారు. తమిళ రైతులు కొన్ని రోజులుగా ఆందోళ‌న చేస్తోన్న కేంద్రం పట్టించుకోవడంలేదని విమర్శించారు.

కాగా, జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద ఆందోళ‌న నిర్వ‌హిస్తున్న త‌మిళ‌నాడు రైతుల‌ను కాంగ్రెస్ పార్టీ ఉపాధ్య‌క్షుడు రాహుల్ గాంధీ క‌లుసుకున్న సంగ‌తి తెలిసిందే. వారితో క‌లిసి ఆయ‌న కొంత‌సేపు నిర‌స‌న కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. దేశంలో ఉన్న ధ‌నికుల‌కు ప్ర‌ధాని మోడీ రుణ మాఫీ క‌ల్పించార‌ని, కానీ దేశాన్ని నిర్మించిన రైతుల‌కు మాత్రం రుణ మాఫీ క‌ల్పించ‌డం లేద‌ని రాహుల్ ఆరోపించారు. త‌మిళ‌నాడు రైతుల క‌ష్టాలు దేశం అంతా వినిపిస్తున్నాయ‌ని, కానీ ప్ర‌ధాని మోడీకి మాత్రం ఆ బాధ‌లు క‌నిపించ‌డం లేద‌ని రాహుల్ విమ‌ర్శించారు. క‌రువు స‌హాయాన్ని ప్ర‌క‌టించాల‌ని గ‌త కొన్ని రోజులుగా త‌మిళ‌నాడు రైతులు ఆందోళ‌న నిర్వ‌హిస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/