Begin typing your search above and press return to search.

జగన్ కు ఉన్నదీ.. బాబకు లేనిది అదే

By:  Tupaki Desk   |   26 July 2019 9:09 AM GMT
జగన్ కు ఉన్నదీ.. బాబకు లేనిది అదే
X
అధికారం కోసం పదేళ్లుగా కష్టపడ్డారు వైఎస్ జగన్. ప్రజలు ఆశీర్వదించారు గెలిపించారు. గెలిపించిన ఓటర్లలో మెజార్టీ బీసీలే. టీడీపీకి కంచుకోటగా ఉన్న బీసీలంతా గంపగుత్తగా జగన్ కు జై కొట్టడమే ఆయన విజయరహస్యం. ఇక తన గెలుపులో కీలకంగా జనాభాలో దాదాపు 50శాతం ఉన్న బీసీలను జగన్ అక్కున చేర్చుకున్నారు. మంత్రి పదవుల్లో మెజార్టీ వారికే ఇచ్చారు. ఇక అత్యధికంగా ఉన్న కాపు- ఎస్సీ- ఎస్టీ- మైనార్టీలను సంతృప్తిపరిచారు. ఇందుకోసం తనతోపాటు పోరాడి.. ఎంతో కష్టపడ్డ అగ్ర సామాజికవర్గానికి చెందిన ధర్మాన ప్రసాద్ రావు- ఆర్కే రోజా- ఆనం రాంనారాయణరెడ్డి- వైవీ సుబ్బారెడ్దిలాంటి సీనియర్లను జగన్ పక్కన పెట్టి ఎంతో ధైర్యం చేశారని చెప్పవచ్చు.

అయితే చంద్రబాబు మాత్రం ఓడినా ఇంకా అలిగేషన్స్ తో సర్దుకుపోవడం ఇప్పుడా పార్టీలో తీవ్ర దుమారం రేపుతోంది. బాబు సామాజిక న్యాయడం చేయకపోవడంపై తెలుగు తమ్ముళ్లు- నేతలు ఆగ్రహంగా ఉన్నట్టు సమాచారం.

తాజాగా పీఏసీ చైర్మన్ గిరిని చంద్రబాబు బీసీలు- కాపు సామాజికవర్గాల వారిని కాలదన్ని తన సామాజికవర్గమైన కమ్మ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ కు కట్టబెట్టడం పార్టీలో చిచ్చు పెట్టింది. ఈ పదవిని గంటా శ్రీనివాసరావు, బీసీ అయిన అనగాని సత్యప్రసాద్- గోరంట్ల బుచ్చయ్య చౌదరి- పయ్యావుల కేశవ్ తోపాటు చాలా మంది ఆశించారు. కానీ చంద్రబాబు మాత్రం పయ్యావులకే పదవి ఇచ్చారు. బీసీ అయిన అనగాని సత్యప్రసాద్ కు కానీ కాపు అయిన గంటాకు కానీ ఇవ్వకపోవడంపై పార్టీలో అసంతృప్తి సెగలు భగ్గుమన్నాయట.. పైగా సీనియర్- వైసీపీ పోరాడుతున్న బుచ్చయ్య చౌదరికి ఇచ్చినా ఇంత వివాదం జరిగి ఉండేది కాదంటున్నారు.

పయ్యావుల కేశవ్ ఈ మధ్య తానా సభల్లో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ తో భేటి అయ్యారని సమాచారం. ఆయన బీజేపీలో చేరబోతున్నట్టు వార్తలు వచ్చాయి. అలాంటి పయ్యావులకు చంద్రబాబు కేబినెట్ పదవి అయిన పీఏసీ చైర్మన్ ఇవ్వడం.. పైగా ఆయన సామాజికవర్గం కమ్మ కావడంతో టీడీపీలో చిచ్చు పెట్టింది.

అధికారంలో ఉన్న జగన్ ఈ అలిగేషన్స్ అన్నీ పక్కనపెట్టేసి.. సీనియర్లను దూరం పెట్టి సామాజిక న్యాయం చేస్తుంటే... బాబు మాత్రం ఇలా బీసీలు, కాపులకు పదవి ఇవ్వకపోవడం.. తన కులానికే ప్రాధాన్యత ఇవ్వడం టీడీపీలో కొత్త వివాదానికి దారితీసిందంటున్నారు.