Begin typing your search above and press return to search.

ఇద్దరు ఆడవాళ్ల పెళ్లి.. ఇంత ఘనంగా జరిగెనండీ?

By:  Tupaki Desk   |   7 Sep 2022 9:37 AM GMT
ఇద్దరు ఆడవాళ్ల పెళ్లి.. ఇంత ఘనంగా జరిగెనండీ?
X
ప్రపంచమే ఓ కుగ్రామంగా మారిన పరిస్థితుల్లో ఇప్పుడు భారతీయులనే పెళ్లి చేసుకోవాలని ఎవరూ మడికట్టుకొని కూర్చోవడం లేదు. ఎక్కడ ఏ దేశపు అమ్మాయి నచ్చితే ఆమెతో వివాహానికి సిద్ధమైపోతున్నారు. వివాహాలు అనేవి దేవుడు నిర్ణయిస్తాడని అంటున్నారు. కానీ ఇప్పుడు వ్యక్తులే తమకు నచ్చిన పిల్లను పెళ్లి చేసుకుంటున్నారు. కానీ ఈ వివాహాల్లో కొన్ని అపశృతులు కూడా చోటుచేసుకుంటున్నాయి.

ఈ మధ్యకాలంలో ఆడ-ఆడ, మగ-మగ పెళ్లి చేసుకునే పాడు సంప్రదాయాలు దాపురించాయి.దీనికి కోర్టులు కూడా అంగీకరిస్తున్నాయి. కానీ తల్లిదండ్రులే అస్సలు ఒప్పుకోవడం లేదు. ఇద్దరు యువతులు, ఇద్దరు యువకులు ఇప్పుడు బహిరంగంగా పెళ్లి చేసుకోవడం కామన్ అయిపోయింది.

తాజాగా ఇద్దరు మహిళలు పెళ్లి చేసుకున్నారు. విశేషం ఏంటంటే వారి ఇరు కుటుంబాలను ఒప్పించి మరీ సంప్రదాయ బద్ధంగా వివాహ వేడుక జరిగింది. భూదేవంత అరుగు వేసి.. ఆకాశమంతా పందిరి వేసి మరీ ఈ పెళ్లి చేశారు. అదే దేశవ్యాప్తంగా సంచలనమైంది.

పెద్దలను ఒప్పించి ఈ ఇద్దరు మహిళలు ఒక్కటయ్యారు. సంప్రదాయ పద్ధతిలో పెళ్లి చేసుకున్నారు. తమిళనాడులోని చెన్నైలో జరిగిన ఈ ఘటన అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది.

సుభిక్షా సుబ్రహ్మణ్యం (29) అనే మహిళ తమిళనాడులో జన్మించింది. 19 ఏళ్లు వచ్చేసరికి ఆమెకు హార్మోన్లలో మార్పు కారణంగా పురుష లక్షణాలు వచ్చాయి. ఆమె ప్రస్తుతం కెనాలోని కాల్గెరీలో చార్టర్డ్ అకౌంటెంట్ గా పనిచేస్తోంది. ఆ తర్వాత ఖతార్ లో ఉంది. అనంతరం కెనెడా వెళ్లి శరీరంలో వచ్చిన మార్పుల గురించి తల్లికి చెప్పింది. తల్లి ఓదార్చింది.

ఇక బంగ్లాదేశ్ కు చెందిన టీనా దాస్ హిందూ కుటుంబంలో జన్మించింది. పెళ్లి చేసుకొని నాలుగు సంవత్సరాలు భర్తతో ఉంది. తర్వాత తాను స్వలింగ సంపర్కురాలు(లెస్బియన్) అని గ్రహించి భర్తను వదిలేసింది.

ఈ టీనా దాస్.. కాల్గెరీలోని ఓ ఆస్పత్రిలో సహాయకురాలిగా పనిచేస్తోంది. అక్కడే టీనాకు, సుభిక్షా కు పరిచయమైంది. స్నేహం ప్రేమగా మారి ఇప్పుడు ఈ ఇద్దరు ఆడవాళ్ల పెళ్లికి దారితీసింది. మొదట తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. కానీ నెలల తర్వాత వీరిద్దరి పట్టుదలకు ఒప్పించారు. దాంతో ఇద్దరూ చెన్నైలో పెళ్లి చేసుకున్నారు. సంప్రదాయబద్దంగా జరిగిన ఈ ఇద్దరు ఆడవాళ్ల పెట్టి వైరల్ గా మారింది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.