Begin typing your search above and press return to search.

పటేల్ కోసం జాతీయ గీతం ఆపేసిన గవర్నరు

By:  Tupaki Desk   |   31 Oct 2015 11:14 AM GMT
పటేల్ కోసం జాతీయ గీతం ఆపేసిన గవర్నరు
X
ఉత్తర ప్రదేశ్ గవర్నర్ రామ్ నాయక్ ఓ వివాదంలో చిక్కుకున్నారు. జాతీయ గీతానికి ఆయన వల్ల తీవ్ర అవమానం కలిగిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉత్తరప్రదేశ్ రాజ్ భవన్ లో శనివారం యూపీ మంత్రుల ప్రమాణ స్వీకారం చేయిస్తున్నా ఆయన జాతీయ గీతాన్ని మధ్యలోనే ఆపివేయించారు. మంత్రుల ప్రమాణ స్వీకారం పూర్తయిన తరువాత జాతీయ గీతాలాపన ప్రారంభం అయ్యింది. గీతం సగంలో ఉండగానే జనగణ మన గీతాలాపన ఆపేయాల్సిందిగా తన సిబ్బందికి రాంనాయక్ సైగ చేశారు. వారు తటపటాయించడంతో తన వ్యక్తిగత సిబ్బందికి చెప్పి గీతాలాపన ఆపించారు.

అయితే... రాంనాయక్ అంతగా పట్టుపట్టి ఎందుకు ఆపించారన్నది వెంటనే ఎవరికీ అర్థం కాలేదు. కానీ, ఆ తరువాత అసలు విషయం అర్థమైంది. ప్రమాణ స్వీకార కార్యక్రమం తరువాత సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సదర్భంగా నిర్వహించే కార్యక్రమంలో ఆయన పాల్గొనాల్సి ఉండడంతో అక్కడికి వెళ్లేందుకు ఆయన తొందర పడ్డారు. ఆ తొంతరలోనే ఆయన జాతీయ గీతాలాపనను సగంలోనే ఆపేయించారు.

కారణం ఏదైనా కానీ జాతీయగీతాన్ని సగంలోనే ఆపించడంపై మాత్రం తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తికి జాతీయ గీతం పట్ల పాటించాల్సిన గౌరవ పద్ధతులు గురించి తెలియవా లేదంటే తెలిసీ తృణీకారభావమా అన్నది తెలియాల్సి ఉంది.