Begin typing your search above and press return to search.
భారత విమాన రాకపోకలపై అమెరికా నిషేధం ఎత్తివేత
By: Tupaki Desk | 26 Oct 2021 5:03 AM GMTకరోనా వైరస్ మహమ్మారి కారణంగా అంతర్జాతీయ విమాన సర్వీసులు నిలిచిపోయాయి. ప్రస్తుతం కరోనా పరిస్థుతులు క్రమంగా సద్దుమణుగుతున్నాయి. దీనితో పలు దేశాలు అంతర్జాతీయ రాకపోకలపై విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తున్నాయి. కరోనా వల్ల సంభవించిన సంక్షోభ పరిస్థితులు సమసిపోయేంత వరకూ ఒక్క విమానాన్ని కూడా నడిపించడానికి ముందుకు రాలేదు. వాయు మార్గాలను మూసివేశాయి. జర్మనీ, అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, కెనడా వంటి పలు దేశాలు భారత్ కు విమాన సర్వీసులను నిలిపివేశాయి.
కరోనా తీవ్రత తగ్గడం తో పరిమితంగా విమాన సర్వీసులను పునరుద్ధరించాయి. ఇదివరకు విధించిన ట్రావెల్ బ్యాన్ ను ఎత్తేశాయి. రెండు డోసుల వ్యాక్సిన్లను తీసుకున్న ప్రయాణికులను విమానాలు ఎక్కడానికి అనుమతి ఇస్తోన్నాయి. కెనడా, ఆస్ట్రేలియా, సౌదీ అరేబియా, జర్మనీ, ఫ్రాన్స్ వంటి దేశాలు భారత్ కు విమాన సర్వీసులను పునరుద్ధరించాయి. అయిదు నెలల పాటు ఈ నిషేధాన్ని కొనసాగించింది. ఏప్రిల్‌లో విధించిన ఈ నిషేధం అయిదు నెలల పాటు కొనసాగింది. ఇక తాజాగా అగ్రరాజ్యం అమెరికా కూడా భారత విమాన ప్రయాణికులపై విధించిన నిషేధాన్ని ఎత్తివేసింది. దాని స్థానంలో కొత్తగా కొన్ని మార్గదర్శకాలు, నిబంధనలను అమలులోకి తీసుకుని రానుంది. నవంబర్ 8వ తేదీ నుంచి ఈ కొత్త మార్గదర్శకాలు అమలులోకి వస్తాయి.
భారత్, చైనా సహా మొత్తం 33 దేశాలపై విధించిన కరోనా వైరస్ ఆంక్షలను ఎత్తి వేస్తున్నట్లు ప్రకటించింది అమెరికా. కొత్తగా రూపొందించిన గైడ్ లైన్స్ పై అధ్యక్షుడు జో బైడెన్ సంతకం చేశారని ఆయన అధికారిక నివాసం వైట్ హౌస్ వెల్లడించింది. ఈ మేరకు ఓ ప్రకటన జారీ చేసింది. ఈ కొత్త మార్గదర్శకాలను విదేశీ పౌరులకు మాత్రమే కాకుండా.. ఆయా దేశాల్లో నివసిస్తోన్న తమ సొంత ప్రజలకు కూడా వర్తింపజేసింది అమెరికా. నవంబర్ 8వ తేదీ తరువాత తమ స్వదేశానికి వచ్చే అమెరికన్లు మూడురోజుల కరోనా వైరస్ నెగెటివ్ సర్టిఫికెట్‌ను తప్పనిసరిగా అందజేయాల్సి ఉంటుంది.
భారత్, చైనా ఇతర 33 దేశాలకు చెందిన పౌరులు.. రెండు డోసుల వ్యాక్సిన్ తప్పనిసరిగా తీసుకుని ఉండాలి. అలాగే మూడురోజుల పాటు చెల్లుబాటయ్యేలా కరోనా వైరస్ నెగెటివ్ సర్టిఫికెట్‌ను అందజేయాల్సి ఉంటుంది. రెండో డోసుల వ్యాక్సిన్ తీసుకోని వారికి తమ దేశానికి రావడానికి అనుమతి ఉండదని అమెరికా స్పష్టం చేసింది. జనాభాలో 10 శాతం మాత్రమే వ్యాక్సిన్ వేసుకున్న దేశాలకు చెందిన ప్రజలపై కొన్ని కొత్తగా విధించింది యూఎస్. అలాంటి దేశాలకు చెందిన పౌరులు.. అమెరికాకు రావడానికి గల కారణాన్ని వివరించాల్సి ఉంటుంది. అది సంతృప్తికరంగా ఉంటేనే అనుమతి లభిస్తుంది.
ఈ క్రమంలో కొన్ని వర్గాల వారికి మినహాయింపును ఇచ్చింది అమెరికా. 18 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న వారికి ఈ నిబంధనలు వర్తించవు. వారు ఎలాంటి కారణాన్ని చూపించకుండా అమెరికాలో అడుగు పెట్టొచ్చు. తమ వయస్సు 18 సంవత్సరాల లోపే అని తెలియజేసే ధృవీకరణ పత్రాన్ని అధికారులకు అందజేయాల్సి ఉంటుంది. వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల ఆరోగ్యానికి ప్రమాదమని భావించే వారికి మినహాయింపు ఉంది. తాము విడుదల చేసిన మార్గదర్శకాలను అన్ని దేశాలకు చెందిన పౌర విమానయాన సంస్థలు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుందని పేర్కొంది. అమెరికాలో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతోంది. ఇప్పటిదాకా 4,64,15,468 పాజిటివ్ కేసులు అక్కడ నమోదయ్యాయి. కొత్తగా 24 గంటల్లో కొత్తగా 47,861 కేసులు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటిదాకా మరణించిన వారి సంఖ్య 7,57,824కు చేరింది.