ప్రేక్షకులు ఓటీటీల వైపే మొగ్గు చూపుతున్నరన్న స్టార్ డైరెక్టర్
ప్రజలు సినిమా హాళ్లలో కంటే OTTలో సినిమాల ను చూడటానికి ఇష్టపడుతున్నారని కూడా అన్నారు.
By: Tupaki Desk | 15 July 2023 6:16 AM GMTకెరీర్ లో 'కిక్' లాంటి చెప్పుకోదగ్గ బ్లాక్ బస్టర్ చిత్రాన్ని తెరకెక్కించారు బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సాజిద్ ఖాన్. భాయ్ ఈ సినిమా సీక్వెల్లో నటిస్తారని చాలా కాలంగా ప్రచారం ఉంది. ఎట్టకేల కు సల్మాన్ ఖాన్ తో ఇప్పుడు కిక్ 2 తెరకెక్కించేందుకు సాజిద్ సిద్ధమవుతున్నాడు. ఖాన్ అభిమానులు కిక్ గురించి చాలా కాలంగా ఆసక్తిగా వేచి చూస్తుండడంతో ఈ సినిమా ని ప్రారంభించేందుకు నదియావాలా సిద్ధమవుతున్నారని తెలిసింది. ఇటీవల దుబాయ్ లో జరిగిన బవాల్ ఈవెంట్ లో సాజిద్ నడియాద్వాలా ఇదే విషయాన్ని ధృవీకరించారు. తాను కిక్ తో ఫిల్మ్ మేకర్ గా కెరీర్ ప్రారంభించానని కిక్ 2 తన ఫేవరెట్ పెట్ ప్రాజెక్ట్ అని చెప్పాడు.
తాను కిక్ పై మాట్లాడిన క్షణం ఇండస్ట్రీ అయినా.. మీడియా అయినా అందరూ సినిమా గురించి హైప్ చేస్తారని అతడు చెప్పాడు. అయితే సాజిద్ నడియాద్వాలా ఒక ముఖ్యమైన విషయం చెప్పాడు. కిక్ 2 ని భారీ స్థాయి లో తీయాలనుకుంటున్నానని మంచి టైమ్ లో రిలీజ్ చేయాలనుకుంటున్నానని అన్నారు. "సబ్జెక్ట్ పేపర్ పై ఉంది. పూర్తిగా రాసా ను.. కానీ సమయం కావాలి. రియల్ కిక్ ఇచ్చే కంటెంట్ తో తిరిగి సినిమా తీస్తాను" అని అన్నారు.
ఇదే సందర్భం లో సినీ ఇండస్ట్రీ కష్టాల గురించి సాజిద్ ప్రస్థావించారు. కరోనా ప్రభావం సినీరంగం పై ఎంతగానో పడిందని కూడా సాజిద్ నడియావాలా అన్నారు. మహమ్మారి ఆర్థిక వ్యవస్థ పై భారీ ప్రభావాన్ని చూపింది. ప్రజలు సినిమా హాళ్లలో కంటే OTTలో సినిమాల ను చూడటానికి ఇష్టపడుతున్నారని కూడా అన్నారు. సినీనిర్మాతల పైనా కరోనా క్రైసిస్ వల్ల తీవ్ర ప్రభావం పడింది. ప్రతి ఒక్కరూ కోవిడ్ అనంతర అంధత్వంలో ఉన్నారని ఇంకా కోలుకుంటున్నారని సాజిద్ అన్నారు.
ప్రేక్షకుల ను సినిమా హాళ్లకు రప్పించాలంటే గొప్ప సినిమా కావాల ని కూడా అన్నారు. ప్రజలు మళ్లీ హాళ్లకు వెళ్లడం ప్రారంభించారు గనుక త్వరలో సినిమా చేస్తానని సాజిద్ నడియాడ్ వాలా అన్నారు. కరోనా సమయం లో కిక్ 2 స్క్రిప్ట్ ను ఆయనే స్వయంగా రెడీ చేసారు. హీరో కం నిర్మాత సల్మాన్ ఖాన్ కి స్టోరీ ని వినిపించారు. ఖాన్ జీకి కిక్ 2 స్క్రిప్టు నచ్చింది. ఈ చిత్రం తో ప్రేక్షకుల ను మళ్లీ ఉత్సాహంగా చూడాలని కోరుకుంటున్నాడు. .. అని అన్నారు.
ఓటీటీ లో కొన్ని సినిమాలు విడుదలయ్యాయి. చాలా పెద్ద సినిమాలు స్టూడియోల కు భారీ ధరల కు విక్రయించారు. కానీ గ్లోబల్ కంటెంట్ ను చాలా చూసిన ప్రేక్షకులు ఉత్తమమైన సినిమాల కోసం ఆకలి తో ఉన్నారని సాజిద్ అన్నారు. మనం గొప్ప సినిమాటిక్ అనుభవాన్ని అందించాలి.
వారి డబ్బుకు మాత్రమే కాకుండా సమయానికి కూడా విలువ ఇవ్వడానికి దర్శకనిర్మాతలు చాలా కష్టపడాలి. ప్రేక్షకులు థియేటర్లకు ఉత్తమమైన వాటి కోసం వస్తారు... అని సాజిద్ విశ్లేషించారు. రవితేజ కిక్ చిత్రానికి రీమేక్ గా తెరకెక్కిన హిందీ చిత్రం కిక్ పెద్ద సక్సెసైంది. ఇప్పుడు దీనికి సీక్వెల్ తెరకెక్కిస్తుండడం ఆసక్తిని కలిగిస్తోంది.