ముంబై ఔటర్‌లో 10 ఎకరాలు కొన్న మెగాస్టార్!
ది గ్రేట్ బచ్చన్ ఇటీవల మహారాష్ట్రలోని అలీబాగ్‌లో 10 కోట్ల రూపాయల విలువైన 20 ఎకరాల విశాలమైన స్థలాన్ని కొనుగోలు చేశారు.
By: Tupaki Desk | 23 April 2024 1:30 PM GMT70 ప్లస్ ఏజ్‌లోను నవయువకుడిలా ఉత్సాహంగా పని చేస్తున్నారు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్. ప్రస్తుతం నాగ్ అశ్విన్ సైన్స్ ఫిక్షన్ చిత్రం కల్కి 2898 ADలో ఇమ్మోర్టల్ అశ్వత్థామగా నటిస్తున్నారు. ఇటీవలే ఆయన ఫస్ట్ లుక్ లాంచ్ అయిన సంగతి తెలిసిందే. అమితాబ్ హిందీ చిత్రాల్లో నటిస్తూనే సౌత్ లో భారీ ప్రాజెక్టులకు కమిటవుతున్నారు. ఆయన ఆర్జన కూడా అదే స్థాయిలో ఉంది. అమితాబ్ ఇప్పటికే రియల్ ఎస్టేట్ రంగంలో భారీగా పెట్టుబడులు పెట్టారు. ముంబైలో బహుళ అంతస్తుల భవంతుల్లో అపార్ట్ మెంట్లు కొనుగోలు చేసారు. వందల కోట్ల ఆస్తులను ఆయన కలిగి ఉన్నారు.
ఈసారి బిగ్ బి ప్రఖ్యాత లోధా సంస్థతో కలిసి భూమి కొనుగోలుపై దృష్టి సారించారు. ది గ్రేట్ బచ్చన్ ఇటీవల మహారాష్ట్రలోని అలీబాగ్‌లో 10 కోట్ల రూపాయల విలువైన 20 ఎకరాల విశాలమైన స్థలాన్ని కొనుగోలు చేశారు. గత వారం లావాదేవీ పూర్తయిందని సమాచారం. దిగ్గజ నటుడు అమితాబ్ మరొక వ్యూహాత్మక పెట్టుబడి ఇదని టాక్ వినిపిస్తోంది.
ప్రఖ్యాత రియల్ ఎస్టేట్ డెవలపర్ ది హౌస్ ఆఫ్ అభినందన్ లోధా (HoABL) సారథ్యంలో ఈ డీల్ పూర్తయిందని సమాచారం. కొనుగోలు ఏప్రిల్ 2023లో అధికారికంగా మొదలైందని ఏ అలీభాగ్ అనే ప్రాజెక్ట్‌కి లింక్ చేయడం విశేషం. లోధా సంస్థతో రియల్ ఎస్టేట్‌లోకి ప్రవేశించడం అమితాబ్‌కి ఇది మొదటిది కాదు. అంతకుముందు, ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో ఉన్న ప్రతిష్టాత్మకమైన 7-నక్షత్రాల మిశ్రమ వినియోగ ఎన్‌క్లేవ్ అయిన సరయులోని ఒక ప్లాట్‌లో అమితాబ్ పెట్టుబడి పెట్టారు. దీనిని కూడా HoABL అభివృద్ధి చేసింది.
ఈ ఆస్తి విలువ రూ.14.5 కోట్లుగా అంచనా వేశారు. అయోధ్య రామాలయం నుండి కేవలం 15 నిమిషాల దూరంలో ఉన్న ఈ ప్రాజెక్ట్ మార్చి 2028 నాటికి పూర్తి చేయడానికి షెడ్యూల్ చేసారు. విలాసవంతమైన ఫైవ్ స్టార్ ప్యాలెస్ హోటల్ ఈ ప్రాజెక్టులో భాగంగా ఉంటుంది.
కెరీర్ మ్యాటర్ కి వస్తే.. కల్కి 2898 AD విడుదల కోసం అమితాబ్ అభిమానులు ఆసక్తిగా వేచి చూస్తున్నారు. మేకర్స్ ఇటీవల విడుదల చేసిన టీజర్‌లో అమితాబ్ పాత్ర ఆసక్తిని కలిగించింది. అమరుడైన అశ్వత్థామగా అమితాబ్ పాత్ర ఉత్కంఠ కలిగించింది. ఈ చిత్రంలో ప్రభాస్, దీపికా పదుకొణె, దిశా పటాని తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. విడుదల తేదీని తొందర్లోనే మేకర్స్ ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.