Begin typing your search above and press return to search.

బాలీవుడ్ స్టార్ నటుల ఫోకస్ రియల్ ఎస్టేట్ మీదేనట!

అలా రియల్ ఎస్టేట్ మీద భారీగా పెట్టుబడులు పెట్టిన కొందరు సెలబ్రిటీలకు సంబంధించిన వివరాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.

By:  Tupaki Desk   |   27 Jun 2024 3:53 AM GMT
బాలీవుడ్ స్టార్ నటుల ఫోకస్ రియల్ ఎస్టేట్ మీదేనట!
X

సినిమాతో స్టార్ స్టేటస్ సంపాదించుకున్న నటీనటులు నటనతో పాటు మరిన్ని వ్యాపారాలు చేయటం కొత్తేం కాదు. హోటళ్లు.. రెస్టారెంట్లు.. పబ్బులు.. సౌందర్య వస్తువులు.. బొటిక్ లు.. ఇలా చెప్పుకుంటూ వారు అడుగు పెట్టని వ్యాపారమే లేదు. టాలీవుడ్ లో నాటి తరం కథానాయకుడు.. తర్వాతి కాలంలో రియల్ ఎస్టేట్ రంగంలో తిరుగులేని ముద్ర వేసిన మురళీమోహన్ గురించి తెలిసిందే. ఆయనంత భారీగా కాకున్నా ఇటీవల కాలంలో బాలీవుడ్ స్టార్ నటీనటులు ఇప్పుడు రియల్ రంగం మీద కన్నేసినట్లుగా చెప్పాలి. అలా రియల్ ఎస్టేట్ మీద భారీగా పెట్టుబడులు పెట్టిన కొందరు సెలబ్రిటీలకు సంబంధించిన వివరాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.

వయసుతో పని లేకుండా 80 ఏళ్ల వయసులోనూ బాలీవుడ్ సినిమా మీదనే కాదు.. ఇండియన్ సినిమాకు సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్. ఈ వయసులో ఆయన నటన మీదనే కాదు రియల్ రంగం మీదా ఫోకస్ చేశారు. ఇటీవల ముంబయిలోని వీర్ సావర్కర్ సిగ్నేచర్ బిల్డింగ్ లో మూడు ఆఫీసు స్పేస్ లను రూ.60 కోట్లకు కొనుగోలు చేశారు. ఈ ప్రాపర్టీలు ముంబయిలోని అంధేరి వెస్ట్ పరిసరాల్లోనూ.. వీర దేశాయ్ రోడ్ కు దగ్గర్లోనూ ఉన్నాయి. మొత్తం 8429 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ మూడు ఆఫీసు స్పేస్ భవనాలను ఆయన రూ.59.58 కోట్లకు కొనుగోలు చేసినట్లుగా చెబుతున్నారు.

2023 డిసెంబరులో ముంబయిలోని ఓషివారా ప్రాంతంలో సుమారు పదివేల చదరపుఅడుగుల విస్తీర్ణంలో ఉన్న నాలుగు కమర్షియల్ స్థలాలను రూ.2.07 కోట్లకు లీజుకు తీసుకొని రూ.1.03 కోట్లు సెక్యూరిటీ డిపాజిట్ చేసినట్లుగా తెలుస్తోంది. దే భవనంలో బాలీవుడ్ కు చెందిన పలువురు సెలబ్రిటీలు పెట్టుబడులుపెట్టినట్లుగా చెబుతున్నారు. ఇప్పుడీ సిగ్నేచర్ బిల్డింగ్ లో అమితాబ్ కు మొత్తం ఏడు ఆఫీసు స్పేస్ లు ఉన్నాయని.. ఇందులో బిగ్ బితో పాటు మనోజ్ బాజ్ పాయ్.. కాజోల్.. అజయ్ దేవగణ్.. కార్తీక్ ఆర్యన్.. సారా అలీఖాన్ లాంటి సెలబ్రిటీలకు కూడా ఈ భవనంలో వాణిజ్య యూనిట్లు ఉన్నట్లుగా చెబుతున్నారు.

ఈ భవనంలో బాలీవుడ్ స్టార్ కపుల్ అజయ్ దేవగణ్.. కాజోల్ గత ఏడాది ఆగస్టులో రూ.7.64 కోట్లతో 194 చదరపు మీటర్ల కమర్షియల్ యూనిట్ ను కొనుగోలు చేశారు. ఇందులోని 16, 17 అంతస్తుల్లో ఐదు కమర్షియల్ ప్రాపర్టీలను అజయ్ దేవగణ్ రూ.45.9కోట్లకు కొనుగోలు చేశారు.

బిగ్ బి కుమారుడు అభిషేక్ బచ్చన్ సైతం కొన్ని వారాల క్రితం బోరివాలిలో ఉన్న ఒబెరాయ్ రియల్టీ ప్రీమియం రెసిడెన్షియల్ ప్రాజెక్టు ఒబెరాయ్ స్కై సిటీలో ఆరు కొత్త రెసిడెన్షియల్ ప్రాపర్టీని కొనుగోలు చేవారు. 57వ అంతస్తులోని 4894చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ ప్లాట్ కు రూ.15.42 కోట్లు చెల్లించారు. మనోజ్ బాజ్ పేయ్ ఆయన సతీమణి షబానా రజా గత అక్టోబరులో సిగ్నేచర్ బిల్డింగ్ లో నాలుగు యూనిట్ల కోసం రూ.31 కోట్ల పెట్టుబడి పెట్టారు.

కార్తీక్ ఆర్యన్.. సారా అలీఖాన్ లు సైతం సిగ్నేచర్ బిల్డింగ్ లో 2099 చదరపు అడుగుల యూనిట్ ను సొంతం చేసుకున్నారని.. సారా అలీఖాన్.. అమ్రతా సింగ్ లు గత ఏడాది జులైలో రూ.9 కోట్లకు ప్లాట్ కొనుగోలు చేస్తే.. కార్తీక్ ఆర్యన్ గత ఏడాది సెప్టెంబరులో రూ.10కోట్లకు ప్లాట్ కొన్నారు. ఈ రెండు ప్రాపర్టీలను ఐశ్వర్య ప్రాపర్టీ అండ్ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ లు అమ్మినట్లుగా వెల్లడైంది. ఇలా.. బాలీవుడ్ కు చెందిన పలువురు స్టార్ నటులు రియల్ ఎస్టేట్ మీద భారీగా పెట్టుబడులు పెట్టినట్లుగా చెబుతున్నారు.