Begin typing your search above and press return to search.

లగ్జరీ ఇళ్ల కొనుగోళ్లలో హైదరాబాద్‌ దూకుడు!

నేపథ్యంలోనే దేశంలోని అన్ని నగరాలను అధిగమిస్తూ భారతదేశంలో లగ్జరీ హౌసింగ్‌ కు హైదరాబాద్‌ గమ్యస్థానంగా మారింది. రూ. 40 లక్షల కంటే తక్కువ ధర కలిగిన గృహాల కంటే కూడా రూ.1.5 కోట్ల కంటే ఎక్కువ ధర కలిగిన లగ్జరీ ఇళ్ల కొనుగోళ్లపై వినియోగదారులు దృష్టి సారించారు.

By:  Tupaki Desk   |   10 Oct 2023 4:30 PM GMT
లగ్జరీ ఇళ్ల కొనుగోళ్లలో హైదరాబాద్‌ దూకుడు!
X

దేశంలోనే ఐటీ హబ్‌ గా, ఫార్మా హబ్‌ గా హైదరాబాద్‌ శరవేగంగా ఎదుగుతోంది. ఇప్పటికే ఇతర దేశాలతో పోలిస్తే హైదరాబాద్‌ చౌకైన, నాణ్యమైన వైద్యానికి మెడికల్‌ హబ్‌ గానూ ఉంది. ఈ రంగాల అభివృద్ధితో మరోవైపు రియల్టీ రంగం కూడా తన దూకుడు కనబరుస్తోంది. గృహ వినియోగదారుల ప్రాధాన్యతల్లోనూ గణనీయమైన మార్పులు వచ్చాయి.

ఈ నేపథ్యంలోనే దేశంలోని అన్ని నగరాలను అధిగమిస్తూ భారతదేశంలో లగ్జరీ హౌసింగ్‌ కు హైదరాబాద్‌ గమ్యస్థానంగా మారింది. రూ. 40 లక్షల కంటే తక్కువ ధర కలిగిన గృహాల కంటే కూడా రూ.1.5 కోట్ల కంటే ఎక్కువ ధర కలిగిన లగ్జరీ ఇళ్ల కొనుగోళ్లపై వినియోగదారులు దృష్టి సారించారు. రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌ లో అత్యాధునిక గృహాల విక్రయాలకు డిమాండ్‌ పెరిగింది.

2023 మూడో త్రైమాసికంలో దాదాపు 14,340 గృహాలు మార్కెట్‌లోకి అందుబాటులోకి వచ్చాయి. దీంతో కొత్త లగ్జరీ గృహాలకు అసాధారణమైన డిమాండ్‌ నెలకొంది. దీంతో హైదరాబాద్‌ అన్ని ఇతర ప్రధాన భారతీయ నగరాలను అధిగమించింది, లగ్జరీ గృహాలకు వినియోగదారుల నుంచి ఆదరణ పెరిగినందునే ఈ గృహాలను అందుబాటులోకి తెచ్చాయి.

2018 మూడో త్రైమాసికంలో హైదరాబాద్‌ లో కేవలం 210 లగ్జరీ యూనిట్లు మాత్రమే ఉన్నాయి. ఈ ఏడాది మూడో త్రైమాసికానికి అవి రాకెట్‌ వేగంతో పెరిగాయి. హైదరాబాద్‌లో 14,340 లగ్జరీ యూనిట్లు అందుబాటులోకి వచ్చాయి.

కోవిడ్‌ తీసుకొచ్చిన మార్పులతో పెద్ద ఇళ్లపై దృష్టి సారించేవారి సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఎక్కువ రూములు ఉన్నవాటికి వినియోగదారులు ప్రాధాన్యత ఇస్తున్నారు.

ఇందుకోసం ప్రధాన ప్రాంతాల్లో అత్యున్నత సౌకర్యాలు ఉన్న ఇళ్ల కోసం వినియోగదారులు ఆసక్తి చూపిస్తున్నారు. వినియోగదారులు లగ్జరీ ఇళ్ల వైపు మొగ్గు చూపుతుండటంతో రూ.40 లక్షలు, అంతకంటే తక్కువ ఉన్న ఇళ్ల ధరలు మరింత తగ్గాయి. గృహాల ధర రూ.1 కోటి లేదా అంతకంటే ఎక్కువ ఉన్నా వినియోగదారులు తగ్గడం లేదు. దీంతో లగ్జరీ ఇళ్లకు డిమాండ్‌ పెరుగుతోంది.