జూబ్లీహిల్స్ లో ఒక్కో బంగ్లా రూ.40 కోట్లా?
ఈ నివేదిక ప్రకారం ఏడు నగరాల్లో మొత్తం 59 అల్ట్రా లగ్జరీ విల్లాలు అమ్ముడైనట్లుగా పేర్కొన్నారు.
By: Tupaki Desk | 19 Jan 2025 4:41 AM GMTఆసక్తికర విషయాల్ని వెల్లడించింది అన్ రాక్ గ్రూపు నివేదిక. రూ.40 కోట్ల విలువైన ఒక్కో లగ్జరీ విల్లాలు 2024లో దేశంలోని ఏడు మహా నగరాల్లో ఎన్ని అమ్ముడయ్యాయన్న విషయాన్ని వెల్లడించింది. ఈ ఏడు మహానగరాల్లో హైదరాబాద్ ఒకటి. ఈ నివేదిక ప్రకారం ఏడు నగరాల్లో మొత్తం 59 అల్ట్రా లగ్జరీ విల్లాలు అమ్ముడైనట్లుగా పేర్కొన్నారు. ఇది ఒక్కొక్కటి రూ.40 కోట్లకు పైనే ఉంటుందని వెల్లడించారు.
హైదరాబాద్ విషయానికి వస్తే.. జూబ్లీహిల్స్ లో గత ఏడాదిలో రెండు లగ్జరీ విల్లాలు అమ్ముడయ్యాయని.. వీటి విలువ ఒక్కొక్కటి రూ.40కోట్లుగా పేర్కొన్నారు. 7 నగరాల్లో అమ్ముడైన ఈ లగ్జరీ విల్లాల మొత్తం విలువ రూ.4754 కోట్లుగా పేర్కొన్నారు. ఇందులో 53 అపార్ట్ మెంట్లు కాగా.. 6 బంగ్లాలు ఉన్నాయి. మరో విషయం ఏమంటే.. లగ్జరీ విల్లాల అమ్మకాలు ఏడాదికి ఏడాదికి పెరుగుతూనే ఉన్నట్లు నివేదిక వెల్లడించింది.
2023లో రూ.4063 కోట్ల విలువైన 58 లగ్జరీ విల్లాలు అమ్ముడు కాగా.. 2024లో ఆది 17 శాతం పెరుగుదల ఉండటం గమనారహం. 2024లో అమ్ముడైన అల్ట్రా లగ్జరీ గ్రహాల్లో రూ.100 కోట్లు విలువైన యూనిట్లు ఏకంగా 17 ఉన్నట్లుగా పేర్కొన్నారు. వీటి మొత్తం విలువ రూ.2344 కోట్లుగా పేర్కొన్నారు. ఈ లగ్జరీ విల్లాల అమ్మకాల్లో దేశ ఆర్థిక రాజధాని ముంబయి మొదటి స్థానంలో నిలిస్తే.. ఢిల్లీ.. బెంగళూరు.. హైదరాబాద్ లు తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ముంబయిలో అత్యధికంగా 52 యూనిట్లు అమ్ముడైతే.. రెండో స్థానంలో నిలిచిన ఢిల్లీ ఎన్ సీఆర్ లో 3 మాత్రమే అమ్ముడు కావటం గమనార్హం. బెంగళూరు.. హైదరాబాద్ రెండేసి చొప్పున అమ్ముడైనట్లుగా నివేదికలో పేర్కొన్నారు.