Begin typing your search above and press return to search.

సచిన్‌ రికార్డు సమం చేసిన విరాట్‌.. తెరపైకి కుశాల్‌ కుసంస్కారం!

వివరాళ్లోకి వెళ్తే... ఎవరైనా ఆటగాడు ఏదైనా రికార్డ్ సాధిస్తే అతడిని మిగిలిన దేశాల క్రీడాకారులు కూడా అభినందిస్తుంటారు.

By:  Tupaki Desk   |   6 Nov 2023 8:55 AM GMT
సచిన్‌  రికార్డు సమం చేసిన విరాట్‌.. తెరపైకి కుశాల్‌  కుసంస్కారం!
X

వన్డే వరల్డ్‌కప్‌ - 2023లో భాగంగా దక్షిణాఫ్రికాతో ఆదివారం జరిగిన మ్యాచ్‌ లో భారత్ భారీ తేడాతో గెలుపొందిన సంగతి తెలిసిందే. దీంతో... ఈ వరల్డ్ కప్ లో ఆడిన ఎనిమిది మ్యాచ్ లూ గెలిచి పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్ లో ఉంది. ఈ మ్యాచ్ లో చాలా రోజులుగా టీం ఇండియా క్రికెట్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న విరాట్‌ కోహ్లి 49వ వన్డే శతకం కూడా ఆవిష్కృతమైంది. ఈ సమయంలో ఆ రికార్డ్ పై పెదవి విరుస్తున్నట్లుగా స్పందించాడు శీలకం కెప్టెన్! దీంతో నెటిజన్లు అతడిని ఒక ఆటాడుకుంటున్నారు.

అవును... తాజాగా ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో టీం ఇండియా స్టార్ క్రికెటర్ కొహ్లీ తన 49వ సెంచరీ సాధించి, సచిన్‌ టెండూల్కర్‌ అత్యధిక వన్డే సెంచరీల రికార్డును (49 సెంచరీలు) సమం చేసిన చేశాడు. దీంతో యావత్‌ క్రీడా ప్రపంచం విరాట్‌ సాధించిన ఈ ఘనతను కీర్తిస్తుంది. విరాట్‌ నామస్మరణతో సోషల్‌ మీడియా మార్మోగిపోతుంది. ఈ సమయంలో విరాట్ సెంచరీ చేస్తే తానెంందుకు స్పందించాలి అని అంటున్నాడు శ్రీలంక కెప్టెన్!

వివరాళ్లోకి వెళ్తే... ఎవరైనా ఆటగాడు ఏదైనా రికార్డ్ సాధిస్తే అతడిని మిగిలిన దేశాల క్రీడాకారులు కూడా అభినందిస్తుంటారు. కొంతమంది స్వఛ్చందా అభినందిస్తే.. మరికొందరు మీడియా ప్రశ్నించినప్పుడు స్పందిస్తుంటారు. అయితే తాజాగా విరాట్ సాధించిన ఘనతను అభినందించేందుకు నిరాకరించి, నెట్టింట హాట్‌ టాపిక్‌ గా మారాడు శ్రీలంక కెప్టెన్.

ఇవాళ శ్రీలంక - బంగ్లాదేశ్‌ జట్లు తలపడనున్న నేపథ్యంలో ఈ మ్యాచ్‌ కు ముందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శ్రీలంక కెప్టెన్‌ కుశాల్‌ మెండిస్‌ ను ఓ విలేకరి.. విరాట్‌ రికార్డు శతకంపై కుశాల్‌ ను ప్రశ్నించాడు. ఇందులో భాగంగా... విరాట్‌ 49వ వన్డే సెంచరీ సాధించి, సచిన్‌ రికార్డు సమం చేసినందుకు మీరు అభినందనలు తెలిపాలని అనుకుంటున్నారా..? అని అడిగాడు.

అందుకు స్పందించిన కుశాల్‌... "నేనెందుకు అతన్ని అభినందిస్తాను" అంటూ షాకింగ్‌ సమాధానం చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు. పైగా దానికి ఒక వెకిలి నవ్వు కూడా యాడ్ చేశాడని కామెంట్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది. ఇది చూసిన క్రికెట్ అభిమానులు, కోహ్లీ అభిమానులు, టీం ఇండియా అభిమానులూ... కుశాల్‌ ను ఏకి పారేస్తున్నారు.

ఇందులో భాగంఘా... కుశాల్‌ ను కుసంస్కారి అని నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. ఇలా కనీస మర్యాద కూడా లేని వ్యక్తిని కెప్టెన్‌ గా శ్రీలంక క్రికెట్‌ బోర్డు ఎలా నియమించిందని మండిపడుతున్నారు. కొహ్లీని అభినందిస్తే పాయింట్ల పట్టికలో స్కోర్ ఏమైనా తగ్గిపోతుందా అంటూ కామెంట్ చేస్తున్నారు. వరల్డ్ కప్ మ్యాచ్ లో టీం ఇండియా ఇచ్చిన షాక్ నుంచి ఇంకా తేరుకోలేదేమో అని మరికొంతమంది కామెంట్ చేస్తున్నారు. కొహ్లీ తన 49 సెంచరీలలోనూ అత్యధికంగా 10 సెంచరీలు చేసింది శ్రీలంకపైనే అని మరికొంతమంది గుర్తు చేస్తున్నారు.

కాగా... ఈ వరల్డ్ కప్ లో భాగంగా ఆడిన 7 మ్యాచ్ లలోనూ 5 మ్యాచుల్లో ఓడిన శ్రీలంక 4 పాయింట్లతో మైనస్ రన్ రేట్ తో ఏడో స్థానంలో ఉన్న సంగతి తెలిసిందే. అదేవిదంగా.. ముంబయి వేదికగా జరిగిన మ్యాచ్‌ లో భారత్‌ నిర్దేశించిన 358 పరుగుల లక్ష్య ఛేదనలో శ్రీలంక ఘోరంగా విఫలమైన సంగతి తెలిసిందే. టీంఇండియా బౌలర్ల దెబ్బకు కేవలం 55 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఆ జట్టుపై తీవ్ర విమర్శలు రేగాయి.