Begin typing your search above and press return to search.

ఆఫ్గనిస్తాన్ 3.0... శ్రీలంక చిత్తు చిత్తు... సెమీఫైనల్ రేసులో ఎంట్రీ?

ఏమాత్రం ఊహించిన ఫెర్మార్మెన్స్ కాదు ఇది.. ఎవరు అనుకోలేదు కూడా.. పైగా ఈ దేశం ఆడే మ్యాచ్ లు వన్ ప్రత్యర్థులకు వన్ సైడ్ అయిపోతాయని కొందరంటే.. బోర్ కొట్టించే మ్యాచ్ లుగా మిగిలిపోతాయని మరికొందరు కామెంట్ చేశారు.

By:  Tupaki Desk   |   31 Oct 2023 3:46 AM GMT
ఆఫ్గనిస్తాన్  3.0... శ్రీలంక చిత్తు చిత్తు... సెమీఫైనల్  రేసులో ఎంట్రీ?
X

ఏమాత్రం ఊహించిన ఫెర్మార్మెన్స్ కాదు ఇది.. ఎవరు అనుకోలేదు కూడా.. పైగా ఈ దేశం ఆడే మ్యాచ్ లు వన్ ప్రత్యర్థులకు వన్ సైడ్ అయిపోతాయని కొందరంటే.. బోర్ కొట్టించే మ్యాచ్ లుగా మిగిలిపోతాయని మరికొందరు కామెంట్ చేశారు. టోర్నమెంట్ మొదలైన మొదట్లో కూడా ఈ వ్యాఖ్యలను బలం చేకూరుతూనే ఉంది. అయితే ఊహించని రీతిలో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ ను చిత్తుచేసింది పసికూన అని చెబుతున్న ఆఫ్ఘాన్.

అయితే అదంతా గాలివాటం అని అప్పటికీ కొన్ని కామెంట్లు వినిపించాయి. ఒక్కోసారి అలా జరుగుతుందని సన్నాయినొక్కులు నొక్కినోళ్ల నోళ్లు మూయిస్తూ... పాకిస్థాన్ కు ఊహించని షాకిస్తూ.... మట్టికరిపించింది ఆఫ్గాన్ టీం. దీంతో ప్రపంచం మొత్తం ఈ టీం గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టింది. ఇదే సమయంలో ఆ టీం కోచ్ జొనాతన్, మెంటర్ అజయ్ జడేజా ల ముఖాల్లో చిరునవ్వులు దర్శనమిచ్చాయి. ఈ క్రమంలో తాజాగా శ్రీలంకకు షాకిచ్చింది ఆఫ్గాన్!

అవును... అంతర్జాతీయ క్రికెట్లో మరో మెట్టెక్కుతూ వరల్డ్ కప్ టోర్నీలో మూడో సంచలనం నమోదు చేసింది ఆఫ్గనిస్తాన్. దీంతో... ఇంగ్లాండ్, పాకిస్థాన్, శ్రీలంకలను వరుసగా 10, 7, 6 స్థానాలకు నెట్టి ఇప్పుడు 5 స్థానంలో నిలిచిన ఆఫ్గాన్... ఏకంగా సెమీఫైనల్ రేసులో నిలిచింది. ఇంకా మూడు మ్యాచ్ లు మిగిలి ఉన్న ఈ టీం... వాటిలో ఏవో రెండు మ్యాచ్ లు గెలిస్తే... క్రికెట్ చరిత్ర పుస్తకంలో వీరికోసం కొత్త పేజీలు రాయాల్సిందే!

సోమవారం శీలంక - ఆఫ్గనిస్తాన్ జట్ల మద్య జరిగిన మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 49.3 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌటైంది. శ్రీలంక బ్యాటర్లలో నిశాంక (46) టాప్‌ స్కోరర్‌ కాగా.. కుశాల్‌ మెండిస్‌ (39), సమరవిక్రమ (36) మాత్రమే రాణించారు. ఇక 10 వికెట్లు పడగొట్టడంలో ఫారూఖీ (4/34), ముజీబ్‌ (2/38) ఆఫ్గన్ బౌలర్లలో కీలక పాత్ర పోషించారు.

242 పరుగుల లక్ష్యంతో ఛేజింగ్ కి దిగిన ఆఫ్గాన్... అజ్మతుల్లా ఒమర్‌జాయ్‌ (73 నాటౌట్‌; 63 బంతుల్లో 6×4, 3×6) సూపర్‌ ఇన్నింగ్స్‌ తో లక్ష్యాన్ని అఫ్గానిస్థాన్‌ 45.2 ఓవర్లలో మూడే వికెట్లు కోల్పోయి ఛేదించింది. రహ్మత్‌ షా (62), హష్మతుల్లా (58 నాటౌట్‌) కీలక ఇన్నింగ్స్‌ ఆడారు. ఫారూఖీకి "ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌" అవార్డు లభించింది. దీంతో... ఆఫ్గన్ టీం పై ప్రశంసల జల్లులు కురుస్తున్నాయి.

కాగా... ఈ టోర్నీ పాయింట్ల పట్టికలో ఇప్పటివరకూ ఆడిన అన్ని మ్యాచ్ లూ గెలిచిన భారత్ 12 పాయింట్లతో టాప్ ప్లేస్ లో ఉండగా.. దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలు వరుసగా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అద్భుతాలు ఏమీ జరగక పోతే ఈ నాలుజట్లే సెమీస్ కు వెళ్తాయి!.. అయితే ఆఫ్గనిస్థాన్ ఫెర్మార్మెన్స్ చూస్తుంటే... ఆస్ట్రేలియా తర్వాత ప్లేస్ లో ఉన్న ఆఫ్గన్ ఏదైనా అద్భుతం చేస్తుందేమో అనే అనుమానం క్రికెట్ ఫ్యాన్స్ లో మొదలైంది. అదే జరిగితే... సరికొత్త హిస్టరీనే!

ఈ క్రమంలో నవంబర్ 3 న నెదర్లాండ్, నవంబర్ 7 న ఆస్ట్రేలియా, నవంబర్ 10న సౌతాఫ్రికాలతో ఆఫ్గనిస్తాన్ తలపడనుంది.