Begin typing your search above and press return to search.

విరాట్ పై రాళ్లు... ఇవిగో కారణాలు!

ప్రధానంగా టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కొహ్లీ గత ఐదేళ్లలో చూపించిన టెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అవుతోంది.

By:  Tupaki Desk   |   28 Oct 2024 4:05 AM GMT
విరాట్  పై రాళ్లు... ఇవిగో కారణాలు!
X

న్యూజిలాండ్ తో సొంతగడ్డపై వరుసగా రెండు మ్యాచ్ లు ఓడిపోయి సిరీస్ ను కోల్పోవడంతో ఇప్పుడు టీమిండియా సీనియర్స్ పెర్ఫార్మెన్స్ పై విపరీతమైన చర్చ నడుస్తోంది. ఇందులో భాగంగా.. ప్రధానంగా టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కొహ్లీ గత ఐదేళ్లలో చూపించిన టెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అవుతోంది.

అవును... న్యూజిలండ్ తో జరుగుతున్న మూడు టెస్టుల సిరీస్ లో ఇప్పటివరకూ జరిగిన రెండు టెస్టుల్లోనూ పెద్దగా రాణించని సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్ లో మాత్రం 70 పరుగులు చేశాడు. ఇక రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో 9 బంతుల్లో 1 పరుగు, రెండో ఇన్నింగ్స్ లో 17 పరుగులు మాత్రమే చేశాడు.

ఈ సమయంలో కొహ్లీ పెర్ఫార్మెన్స్ పై భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ఆందోళన వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా.. గత ఐదేళ్లలో కొహ్లీ రెండు సెంచరీలే చేశడనే విషయంతో పాటు గత ఐదేళ్లలో అతడి గణాంకాలు ఆందోళనకర స్థితిలో ఉన్నాయని తెలిపాడు. ఈ సందర్భంగా సంవత్సరాల వారీగా కొహ్లీ టెస్ట్ స్కోర్ సగటును ప్రస్థావించాడు.

ఇందులో భాగంగా... 2020లో 19 సగటుతో ఆడిన కొహ్లీ.. 2021లో సగటు 28 కలిగి ఉన్నాదు. అయితే.. 2023లో మాత్రం రెండు సెంచరీలు చేసి సగటును 55కి పెంచుకున్నాడు. ఇక ఈ ఏడాది విషయానికొస్తే.. ఆడిన 8 ఇన్నింగ్స్ లోనూ 32 సగటుతో ఉన్నాడు అని వివరించాడు ఆకాశ్ చోప్రా. ఇప్పుడు ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.

మరోపక్క టెస్ట్ క్రికెట్ లో పోటీ పెరిగిపోతుందని.. ఒకటి రెండు మ్యాచ్ లలో ఫెయిల్ అయితే వెనుక ఒత్తిడి పెరిగిపోతుందని.. ఇటీవల కేఎల్ రాహుల్ – సర్పరాజ్ విషయంలో జరిగిన చర్చే దీనికి తాజా ఉదాహరణ అని అంటున్నారు విశ్లేషకులు. ఈ నేపథ్యంలో... మూడో టెస్ట్ మ్యాచ్ లో అయినా కొహ్లీ తనదైన పెర్ఫార్మెన్స్ ఇవ్వకపోతే.. పూలు పడిన చోటే రాళ్లు పడినట్లు అవుతుందని చెబుతున్నారు!

కాగా... న్యూజిలాండ్ తో మూడు టెస్టుల సిరీస్ లో భారత్ తొలి రెండు మ్యాచ్ ల్లో ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఫలితంగా.. స్వదేశంలో భారత్ 12 ఏళ్ల తర్వాత సిరీస్ ను కోల్పోయింది. ఇక మూడో టెస్ట్ ముంబై వాంఖడే వేదికగా నవంబర్ 1 నుంచి కాబోతుంది.