Begin typing your search above and press return to search.

అబ్బా.. ఎప్పుడూ బౌలింగేనా? ముందు బ్యాటింగ్ చేయొచ్చుగా?

ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్ లకు గాను మూడింట్లో టాస్ టీమిండియా వైపు నిలవలేదు. విశేషం ఏమంటే.. దాయాది పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో మాత్రం టాస్ మనల్నే వరించింది.

By:  Tupaki Desk   |   20 Oct 2023 7:39 AM GMT
అబ్బా.. ఎప్పుడూ బౌలింగేనా? ముందు బ్యాటింగ్ చేయొచ్చుగా?
X

ప్రపంచ కప్ లో టీమిండియా అదరగొడుతోంది. వరుసగా నాలుగో మ్యాచ్ లోనూ ఘన విజయం సాధించింది. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి మ్యాచ్ లో మొదట్లో కొద్దిగా ఇబ్బంది పడినా.. మిగతా మూడు మ్యాచ్ లలోనూ తేలిగ్గా గెలిచింది. పాకిస్థాన్ మీద అయితే చిరకాల ప్రత్యర్థితో కాదు.. పసికూనతో ఆడుతున్నట్లుగా అనిపించింది. గురువారం బంగ్లాదేశ్ పై మరింత సులువుగా దంచేసింది. అఫ్ఘానిస్థాన్ ను ఆటాడుకుంది. ఇదంతా ఛేజింగ్ లోనే జరిగింది.టాస్ మనకు దక్కట్లే..

ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్ లకు గాను మూడింట్లో టాస్ టీమిండియా వైపు నిలవలేదు. విశేషం ఏమంటే.. దాయాది పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో మాత్రం టాస్ మనల్నే వరించింది. కానీ, కెప్టెన్ రోహిత్ మాత్రం బౌలింగ్ నే ఎంచుకున్నాడు. మిగతా మూడు మ్యాచ్ ల (అస్ట్రేలియా, అఫ్గాన్, బంగ్లాదేశ్)లో ప్రత్యర్థి జట్టు కెప్టెనే టాస్ నెగ్గాడు. సహజంగానే బ్యాటింగ్ ఎంచుకున్నాడు.ముందు బ్యాటింగ్ మజానే వేరు

ప్రపంచ కప్ లో మన జట్టు ముందు బ్యాటింగ్ చేస్తే చూద్దామని అభిమానులు ఎంతో ఆశగా ఉన్నారు. కానీ, నాలుగు సార్లూ మొదట బౌలింగే చేయాల్సి రావడంతో కాస్త నిరుత్సాహానికి గురవుతున్నారు. వాస్తవానికి అంతర్జాతీయ స్థాయిలో దేన్ని అయినా స్వీకరించాలి. కాకపోతే.. సగటు అభిమానిగా ముందు బ్యాటింగ్ అనేది మజా ఇస్తుంది. నిజమైన క్రికెట్ ప్రేమికులకు అయితే ఏదైనా ఒకటే.ఛేదనే మేలు..

ఒకమాటలో చెప్పాలంటే ముందు బ్యాటింగ్ కంటే ఛేజింగే మేలు. అప్పుడే బ్యాట్స్ మన్ దమ్మేమిటో తెలుస్తుంది. క్రికెట్ అంటే బ్యాట్స్ మెన్ గేమ్. ఆ బ్యాట్స్ మన్ సత్తా ఛేదనలోనే బయటపడుతుంది. ఇలాగే అన్ని మ్యాచ్ లలోనూ మన టాప్ ఆర్డర్ దుమ్మురేపిన సంగతి గుర్తుంచుకోవాలి.మరో 5.. ఎన్నిట్లో వస్తుందో బ్యాటింగ్ చాన్స్?

లీగ్ దశలో టీమిండియా మరో ఐదు మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. అందులో ఇంగ్లండ్,దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ వంటి పెద్ద జట్లతో ఆడాల్సి ఉంది. శ్రీలంక, నెదర్లాండ్స్ తో నూ తలపడాల్సి ఉంది. వీటిలో ఎన్నిట్లో మొదట బ్యాటింగ్ చేస్తుందో చూడాలి. ఒకవేళ తొలుత బ్యాటింగ్ కు దిగితే కనుక భారీ స్కోరు చేయాల్సి ఉంటుంది. తద్వారా ప్రత్యర్థికి ఊహించని లక్షాన్ని నిర్దేశించవచ్చు.