Begin typing your search above and press return to search.

‘కెర్’ కేక.. మహిళల క్రికెట్ లో ఆమె ఓ సూపర్

పురుషుల క్రికెట్ లోలాగా మహిళల క్రికెట్లో పూర్తి స్థాయి ఆల్ రౌండర్లు తక్కువ.

By:  Tupaki Desk   |   21 Oct 2024 2:30 PM GMT
‘కెర్’ కేక.. మహిళల క్రికెట్ లో ఆమె ఓ సూపర్
X

పురుషుల క్రికెట్ లోలాగా మహిళల క్రికెట్లో పూర్తి స్థాయి ఆల్ రౌండర్లు తక్కువ. ఉన్నవారు కూడా బంతితో బ్యాటుతో ఒకే సమయంలో రాణించడం తక్కువ.. కానీ, ఆమె అలా కాదు.. మహిళల క్రికెట్లో సూపర్ స్టార్ అని చెప్పాలి.. బంతితో ఎంతటి ప్రభావం చూపుతుందో.. బ్యాటుతోనూ అలాగే చెలరేగుతుంది.. అలాగని ఆమె సీనియర్ మోస్ట్ క్రికెటర్ కూడా క్రికెటర్ కూడా కాదు.. కేవలం 24 ఏళ్ల వయసు.. ఇప్పటికే 8 ఏళ్ల అంతర్జాతీయ అనుభవం.. ఇప్పుడు టి20 ప్రపంచ కప్ లోనూ దుమ్ము రేపింది. మరీ ముఖ్యంగా ఫైనల్లో ఆల్ రౌండర్ అన్న పదానికి అర్థం చెప్పింది.

అప్పట్లో మానసిక అనారోగ్యం..

కేవలం 25 ఏళ్ల కూడా నిండని అమేలియా కెర్.. కొన్నేళ్ల కిందట తీవ్ర మానసిక సంఘర్షణకు లోనైంది. కుంగుబాటుకు గురయ్యే స్థితికి చేరింది. అలాంటి సమయంలో కుటుంబం అండతో బయటపడిందీ న్యూజిలాండ్ ఆల్‌ రౌండర్. ఒకవేళ అప్పుడు తన కుటుంబమే ప్రస్తుతం తాను ఈ స్థితిలో నిలిచేదాన్నే కాదని చెబుతుంది. మూడేళ్ల కిందట 2021 జూలైలో జరిగింది. వైట్ ఫెర్న్స్ శిక్షణ శిబిరం నుంచి ఆమెను ఇంటికి పంపించేశారు. దీంతో కెర్ ఆందోళనకు గురికాగా.. వైద్యుల వద్దకు తీసుకెళ్లాల్సి వచ్చింది. ఈ కఠిన సందర్భం నుంచి క్రికెట్ తనను బయటపడేసిందని కెర్ చెబుతోంది.

ప్రపంచ కప్ లో అసాధారణ ప్రతిభ

తాజాగా ముగిసిన టి20 మహిళల ప్రపంచ కప్ లో అమెలియా కెర్ అద్భుత ప్రతిభ ప్రపంచానికి పరిచయం అయింది. అటు బ్యాట్, ఇటు బంతితోనూ కెర్ దుమ్మురేపింది. ఒక విధంగా చెప్పాలంటే న్యూజిలాండ్ టి20 ప్రపంచ కప్ లో విజయం సాధించింది అంటే అది కెర్ కారణంగానే. దీంతోనే ఆమెను ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ గా ఎంపిక చేశారు. అంతేకాదు.. ఫైనల్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ కూడా కెర్ కావడం విశేషం. కాగా, టోర్నీలో 15 వికెట్లు పడగొట్టిన కెర్.. ఒక టి20 ప్రపంచ కప్ లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గానూ నిలిచింది.

అత్యంత నిలకడ..

1/19 (భారత్), 4/26 (ఆస్ట్రేలియా), 2/13 (శ్రీలంక), 3/14 (పాకిస్థాన్), 2/14 (వెస్టిండీస్), 3/24 (దక్షిణాఫ్రికా).. ఇదీ తాజా ప్రపంచ కప్ లో కెర్ ప్రతిభ. మరీ ముఖ్యంగా సెమీ ఫైనల్, ఫైనల్లో ఆమె ఐదు వికెట్లు తీయడం గమనార్హం. ఫైనల్ మ్యాచ్ లో టాప్ స్కోరర్ కెర్ (43). ఈ ఇన్నింగ్స్ న్యూజిలాండ్ ను పై చేయి సాధించేలా చేసింది. మొత్తం టోర్నీలో 135 పరుగులు చేసిన కెర్.. మున్ముందు మహిళల ప్రపంచ కప్ లో మరింత పేరు తెచ్చుకోవడం ఖాయం.