డీకాక్ సెంచరీ మిస్... బౌలర్ పై నెటిజన్ల విమర్శలు పీక్స్!
ఈ సమయంలో నెట్టింట కొత్త రచ్చకు దారి తీయడానికి కారణం ఆర్.ఆర్. బౌలర్ ఆర్చర్.
By: Tupaki Desk | 27 March 2025 7:18 AMబుధవారం రాత్రి జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో ఒక ఘటన నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కోల్ కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో.. కేకేఆర్ అద్భుత విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో కేకేఅర్ బ్యాటర్ క్వింటన్ డీకాక్ పెర్ఫార్మెన్స్ విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. ఈ సమయంలో నెట్టింట కొత్త రచ్చకు దారి తీయడానికి కారణం ఆర్.ఆర్. బౌలర్ ఆర్చర్.
అవును... కోల్ కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో కేకేఆర్ తొలుత బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 151 పరుగులు చేసింది. జైశ్వాల్ (29), రియాన్ పరాగ్ (25), దృవ్ జురాల్ (33) పరుగులు చేయడంతో ఆ స్కోర్ సాధ్యమైంది. లక్ష్య చేధనలో కేకేఆర్... 17.3 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి పని పూర్తి చేసింది.
ప్రధానంగా... కేకేఆర్ ఓపెనర్ డికాక్ రాజస్థాన్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. మరో ఓపెనర్ మొయిన్ అలీ కాస్త తడబడినా... ఆర్.ఆర్. బౌలర్లపై తీవ్ర ఒత్తిడి తీసుకురావడంలో డీకాక్ సక్సెస్ అయ్యాడు. ఫలితంగా.. 8 ఫోర్లు, 6 సిక్స్ ల సాయంతో 61 బంతులో 97 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. అయితే... వాస్తవానికి డికాక్ సెంచరీ చేస్తాడని తొతుత చాలా మంది భావించారు. అయితే.. ఆర్చర్ చేసినపనికి అది సాధ్యం కాలేదు.
ఇందులో భాగంగా... 17వ ఓవర్ ముగిసేసరికి డికాక్ స్కోరు 58 బంతుల్లో 81 పరుగులు. అప్పటికి కేకేఆర్ స్కోరు 2 వికెట్ల నష్టానికి 135. అంటే... మరో 17 చేస్తే కేకేఆర్ విజయం సాధిస్తుంది. మరోపక్క మరో 19 పరుగులు చేస్తే డీకాక్ సెంచరీ కూడా పూర్తవుతుంది. ఈ సమయంలో... 18వ ఓవర్ ను ఆర్చర్ వేశాడు. ఈ సమయంలో ఫామ్ లో ఉన్న డికాక్ మొదటి రెండు బంతుల్లోనే విరుచుకుపడ్డాడు.
మొదటి బంతిని ఫోర్ గా, రెండో బంతిని సిక్స్ గా మలిచాడు. దీంతో.. డీకాక్ వ్యక్తిగత స్కోరు 91 కి చేరింది. అంటే... మ్యాచ్ గెలవడానికి 7 పరుగులు, సెంచరీకి 9 పరుగులు అవసరం అన్నమాట. ఈ సమయంలో ఆర్చర్.. తర్వాత వేసిన రెండు బంతులను వైడ్ గా వేశాడు. దీంతో.. తర్వాత బంతిని డీకాక్ సిక్స్ గా మలిచాడు. దీంతో... మ్యాచ్ పూర్తయ్యింది. డీకాక్ స్కోర్ 97*వద్ద ఆగిపోయింది.
ఆర్చర్ రెండు వైడ్లు వేయకపోతే మూడో బంతిని సిక్స్ గా మలిచిన డిక్కాక్... తర్వాత బంతిని ఫోర్ గా మలిచినా.. సెంచరీ సాధించేవాడు. కానీ... ఆ అవకాశం లేకుండా... వరుసగా రెండు వైడ్లు వేశాడు ఆర్చర్. ఇది ఆర్చర్ కావాలనే చేశాడని.. ఇది క్రీడాస్ఫూర్తికి విరుద్ధమని క్రికెట్ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. దీనివల్ల ఆర్చర్ కి ఒరిగిందేమీ లేదు.. నెట్టింట ట్రోల్ అవ్వడం తప్ప అని అంటున్నారు.