Begin typing your search above and press return to search.
డకౌట్ కావాల్సింది.. సెంచరీ కొట్టించారు
By: Tupaki Desk | 9 July 2015 9:03 AM GMT14 ఏళ్లయింది ఇంగ్లాండ్ గడ్డపై ఆస్ట్రేలియా యాషెస్ సిరీస్ గెలిచి. గత మూడు పర్యాయాల్లోనూ ఆ జట్టుకు పరాభవం తప్పలేదు. ఐతే ఈసారి ఇంగ్లాండ్ కన్నా ఆస్ట్రేలియా ఎంతో బలంగా ఉండటం.. ఫామ్ కూడా గొప్పగా ఉండటంతో.. యాషెస్ కంగారూలకే చిక్కుతుందని.. ఇంగ్లాండ్‌ను క్లీన్‌స్వీప్ చేసేస్తుందని ఆస్ట్రేలియా మాజీలు అంచనాలు కట్టేశారు. కార్డిఫ్‌లో బుధవారం తొలి టెస్టు మొదలైన తీరు చూస్తే వాళ్ల అంచనాలు తప్పేమీ కాదనిపించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ గంట గడిచేసరికి 43/3తో నిలిచింది. కెప్టెన్ కుక్ (20), మరో ఓపెనర్ లిత్ (6), సీనియర్ బ్యాట్స్‌మన్ ఇయాన్ బెల్ (1) పెవిలియన్ చేరిపోయారు. 14వ ఓవర్లో స్టార్క్.. బెల్‌ను ఔట్ చేశాక యువ ఆటగాడు జో రూట్ క్రీజులోకి వచ్చాడు. ఆడిన రెండో బంతికే అతను వికెట్ కీపర్ హడిన్‌కు క్యాచ్ ఇచ్చాడు. కానీ హడిన్ ఆ క్యాచ్ అందుకోలేకపోయాడు. కానీ తాను ఎంత పెద్ద తప్పిదం చేశానో ఇంకో సెషన్ ఆట గడిచాక కానీ తెలియలేదు హడిన్‌కు. ఈ తప్పిదానికి భారీ మూల్యమే చెల్లించుకుంది ఆస్ట్రేలియా.
ఓ దశలో 43/3తో ఉన్న ఇంగ్లాండ్ 343/7తో తొలి రోజు ఆటను ముగించింది. ఓ దశలో ఆ జట్టు 280/4తో తిరుగులేని స్థితిలో నిలిచింది. దీనికి కారణం రూటే. హడిన్ క్యాచ్ వదిలేసే సమయానికి అతను ఖాతానే తెరవలేదు. అలాంటి వాడు 134 పరుగులు చేసి.. ఇంగ్లాండ్‌ను పటిష్ట స్థితికి చేర్చి వెనుదిరిగాడు. బాలెన్స్ (61), స్టోక్స్ (52)లతో కలిసి అతను కీలక భాగస్వామ్యాలు నెలకొల్పి ఇంగ్లాండ్‌ను పటిష్ట స్థితికి చేర్చాడు. ఆట చివరి గంటన్నర ఆస్ట్రేలియా బౌలర్లు పుంజుకోబట్టి సరిపోయింది కానీ.. లేకుంటే ఇంగ్లాండ్‌దే తిరుగులేని ఆధిపత్యం అయ్యేది. స్టార్క్ స్వల్ప వ్యవధిలో రూట్, స్టోక్స్‌లను ఔట్ చేసి ఆసీస్‌కు ఉపశమనం ఇచ్చాడు. ఆట ముగిసే సయానికి మొయిన్ అలీ, బాడ్ర్ క్రీజులో ఉన్నారు. వీళ్లిద్దరూ బ్యాటింగ్ బాగానే చేస్తారు. ఈ జంట నిలకడగా ఆడితే.. ఇంగ్లాండ్ స్కోరు 500 దాటినా దాటొచ్చు. అదే జరిగితే ఈ మ్యాచ్‌లో విజయంపై ఆస్ట్రేలియా ఆశలు వదులుకోవాల్సిందే. ఐతే ఆస్ట్రేలియా బౌలర్లు మ్యాచ్‌పై అంత తేలిగ్గా ఆశలు వదులుకునే రకం కాదు. రెండో రోజు సాధ్యమైనంత త్వరగా ఇంగ్లాండ్‌ను ఆలౌట్ చేయడానికి ప్రయత్నిస్తారు. ఆ తర్వాత ఆస్ట్రేలియా ఎలా బ్యాటింగ్ చేస్తుందో చూడాలి.