Begin typing your search above and press return to search.
కింగ్స్.. రాయల్స్ పై నిషేధం
By: Tupaki Desk | 14 July 2015 9:35 AM GMT పేరులో కింగ్స్.. రాయల్స్ ఉండగానే సరికాదు.. చేతల్లో కూడా అలా ఉండాలన్న విషయాన్ని మరిచి.. కాసుల కక్కుర్తితో వ్యవహరించిన వారికి జస్టిస్ లోథా కమిటీ తీవ్రస్థాయిలో మండిపడింది. వారిపై భారీ చర్యలు తీసుకుంది.
ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణంపై తీర్పు వెల్లడైంది. ఈ ఉదంతంపై ఏర్పాటు చేసిన జస్టిస్ లోథా కమిటీ తమ తీర్పును వెల్లడించింది. ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ లో కుంభకోణం జరిగిందన్న విషయాన్ని ఖరారు చేయటమే కాదు.. చెన్నై సూపర్ కింగ్స్.. రాజస్థాన్ రాయల్స్ జట్ల మీద నిషేధాన్ని విధిస్తున్నట్లు పేర్కొంది.
అంతేకాదు.. ఈ కుంభకోణంలో పాత్రధారులుగా బీసీసీఐ మాజీ అధ్యక్షుడు శ్రీనివాసన్ అల్లుడు గురునాథ్ మయ్యప్పన్‌పై క్రికెట్ సంబంధిత కార్యక్రమాలపై జీవితకాల వేటు వేస్తున్నట్లు ప్రకటించారు. ఇక.. బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త.. రాజస్థాన్‌రాయల్స్ సహ యజమాని రాజ్ కుంద్రా మీద కూడా నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించారు.