Begin typing your search above and press return to search.

దక్షిణాఫ్రికా క్రికెట్ దిగ్గజం మృతి!

By:  Tupaki Desk   |   29 July 2015 6:25 AM GMT
దక్షిణాఫ్రికా క్రికెట్ దిగ్గజం మృతి!
X
జాతివివక్ష ఆరోపణలపై 1970 నుంచి 20 ఏళ్లకు పైగా నిషేధం ఎదుర్కొన్న దక్షిణాఫ్రికా... మరలా 1991లో పునరాగమనం చేసింది! ఆ సమయంలో దక్షిణాఫ్రికా వండ్ క్రికెట్ టీం కు తొలి కెప్టెన్ గా క్లైవ్ రైస్ వ్యవహరించారు. క్రికెట్ చరిత్రలో ఎన్నో చారిత్రక అధ్యాయాలలో పాలిభాగస్తుడైన క్లైవ్ బుదవారం మరణించారు. ప్రస్తుతం క్లైవ్ వయసు 66 ఏళ్లు! అయితే గతంలో బ్రెయిన్ క్యాన్సర్ వ్యాదికి శస్త్రచికిత్స చేయించుకుని కాస్త కుదురుకున్న క్లైవ్ కు రక్తంలోని హానికర బాక్టీరియా అధికం కావడంతో సెప్టికామియా వ్యాదిసోకి తీవ్రంగా బాదనుభవించారు. ఈ వ్యాదికి సంబందించి చాలా కాలంగా చికిత్స తీసుకుంటున్న క్లైవ్... ఆస్పత్రిలోనే తుదిశ్వాస విడిచారు!

రైస్ మృతిపట్ల ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేసింది! ఇదే సమయంలో ఐఇసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్, దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ డేవిడ్ రిచర్డ్ సన్... క్లైవ్ తో తనకున్న అనుభవాన్ని గుర్తుచేసుకున్నారు! క్లైవ్ సారథ్యంలోనే సఫారీ జట్టు తొలిసారి భారత పర్యటనకు వచ్చింది! పాతికేళ్ల సుదీర్ఘ ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడిన రైస్... 482 మ్యాచులాడి 26,331 పరుగులు చేశాడు! ఆల్ రౌండర్ నైపుణ్యం కలిగి ఉన్న క్లైవ్ బౌలింగ్ లో కూడా తన అసమాన ప్రతిభ కనపరిచాడు. ఇందుకు సాక్ష్యంగా 930 వికెట్లు తీశాడు!