Begin typing your search above and press return to search.

వామ్మో.. ధోనీ అంత సంపాదిస్తున్నాడా..!

By:  Tupaki Desk   |   12 Jun 2015 5:13 AM GMT
వామ్మో.. ధోనీ అంత సంపాదిస్తున్నాడా..!
X
ప్రపంచంలోని క్రికెటర్లలోకెళ్లా అత్యంత సంపాదన పరుడనే పేరును తెచ్చుకొన్నాడు భారత వన్డే క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ. ఈ సంపాదనతో ఆయన బాగా సంపాదిస్తున్న టాప్‌ 100 అథ్లెట్స్‌లో ఒకడిగా నిలిచాడు. ఆ జాబితాలో నిలిచిన ఏకైక క్రికెటర్‌, ఏకైక భారతీయుడు కూడా ధోనీనే కావడం గమనార్హం.

ఫోర్బ్స్‌ పత్రిక ప్రకటించిన ఈ జాబితాలో ఏడాదికి 198 కోట్లరూపాయల సంపాదన పరుడిగా ధోనీకి స్థానం దక్కింది. గత ఏడాదితో పోలిస్తే ఒక స్థానం దిగువకు వచ్చినా ధోనీకి టాప్‌ హండ్రెడ్‌లో అయితే స్థానం దక్కింది.

ఇక ఈ జాబితాలో బాక్సర్లు టాప్‌ పొజిషన్లలో నిలిచారు. ఇటీవలే అత్యంత భారీ మొత్తం ప్రైజ్‌మనీతో జరిగిన బాక్సింగ్‌ మ్యాచ్‌లో విజేతగా నిలిచిన అమెరికన్‌ బాక్సర్‌ మెవెదర్‌ ఏడాదికి 1,900 కోట్ల రూపాయల సంపాదనతో నంబర్‌వన్‌గా నిలిచాడు.

ఆ తర్వాత పిలిపైన్స్‌ బాక్సర్‌ పాకియావో వెయ్యికోట్ల రూపాయల వార్షిక సంపాదనతో రెండో స్థానంలో ఉన్నాడు. కొలంబియన్‌ ఫుట్‌బాల్‌ స్టార్‌ రొనాల్డో దాదాపు ఐదువందల కోట్ల రూపాయల వార్షిక సంపాదనతో మూడోస్థానంలో ఉన్నాడు.

మహేంద్రసింగ్‌ ధోనీ విషయానికి వస్తే ధోనీ ఆదాయంలో ఎక్కువశాతం అడ్వర్టైజ్‌మెంట్స్‌ నుంచినే సమకూరుతోందని ఫోర్బ్స్‌ అంచనా వేసింది.