Begin typing your search above and press return to search.
మహాపోరాటంలో అంతిమ విజేత జొకోవిచ్
By: Tupaki Desk | 12 July 2015 1:20 PM GMTమరో మహాపోరాటం ముగిసింది. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన వింబుల్డన్ పురుషుల ఫైనల్స్ పూర్తయింది. ఇద్దరు కొదమ సింహాలు నువ్వా..నేనా అన్నట్లు తలపడిన ఫైనల్ పోరులో అంతిమంగా విజయం జొకోవిచ్ నే వరించింది.
అత్యధిక వింబుల్డన్ టైటిళ్లు గెలిచిన ఆటగాడిగా ఉన్న రికార్డును దాటేయాలని భావించిన రోజర్ ఫెదరర్ కు అంతిమంగా నిరాశే మిగిలింది. వింబుల్డన్ ను సొంతం చేసుకున్న పెద్ద వయస్కుడిగా రికార్డు సొంతం చేసుకోవాలని ఎంతో ఆశపడ్డ ఫెదరర్ కు నిరాశ తప్పలేదు. 33ఏళ్ల వయసులో.. 29ఏళ్ల సెర్బియా దేశస్తుడు జొకోవిచ్ తో తలపడిన ఫెదరర్ తీవ్రంగా పోరాడి ఓడిపోయారు.
టైటిల్ కోసం జరిగిన అంతిమ పోరులో.. జొకోవిచ్ 7-6(7-1).. 6-7(10-12)..6-4.. 6-3 తేడాతో స్విస్ ఆటగాడైన ఫెదరర్ కు ఓటమి తప్పలేదు. హోరాహోరీగా సాగిన టైటిల్ పోరులో జొకోవిచ్ అద్భుతంగా ఆడి విజయం సాధించగా..ఫెదరర్ పోరాట పటిమ చూపించి పరాజయం పాలైనా.. తన ఆటతో అందరి మనసును ఆకట్టుకున్నాడు. తాజా విజయంతో తొమ్మిదో గ్రాండ్ స్లామ్ సింగిల్స్ టైటిల్ సొంతం చేసుకున్న జొకోవిచ్.. వింబుల్డన్ ను ముచ్చటగా మూడోసారి గెలుచుకున్న ఆటగాడిగా అవతరించారు.
గత సంవత్సరం జరిగిన వింబుల్డన్ ఫైనల్ లోనూ వీరిద్దరే తలపడిన సమయంలోనూ.. జొకోవిచ్ విజయం సాధించారు. వీరిద్దరూ తమ కెరీర్ లో ఇప్పటివరకూ 39 సార్లు తలపడగా రోజర్ 20 విజయాలతో ముందుండగా.. తాజా విజయంతో వీరిద్దరూ సమాన విజయాలతో నిలిచిన పరిస్థితి.