Begin typing your search above and press return to search.
''వీరాభిమానికి మేమున్నాం'' అన్న టీమిండియా
By: Tupaki Desk | 24 Jun 2015 4:22 AM GMTసచిన్ లాంటి ప్రఖ్యాత క్రికెటర్లు సైతం అభిమానించే వీరాభిమాని సుధీర్ గౌతమ్. టీమిండియా మ్యాచ్ ఎక్కడ జరిగినా.. చేతిలో జాతీయ పతాకం చేతబట్టి ఉత్సాహపరిచే ఆయన్ను.. బంగ్లాదేశ్‌లో జరిగిన భారత్.. బంగ్లాదేశ్ రెండో మ్యాచ్ ముగిసిన తర్వాత బంగ్లాదేశీయులు భౌతికదాడులకు పాల్పడటం తెలిసిందే.
ఈ ఉదంతం బయటకు వచ్చిన తర్వాత మిగిలిన అభిమానుల మాదిరే.. టీమిండియా సభ్యులు సైతం చాలా ఫీలైపోయారంట. ఆయనపై దాడి జరిగిన నేపథ్యంలో బంగ్లా పోలీసులు ఆయనకు రక్షణగా నిలిచారు. సుధీర్‌కు టీమిండియా క్రికెట్ సభ్యులు అండగా నిలిచారు. జట్టు సభ్యుల్లో పలువురు ఈ ఉదంతంపై సుధీర్‌ని కలిసి.. తామంతా ఉన్నామని ధైర్యం చెప్పారని సుధీర్ వెల్లడించారు.
ఏ సమస్య వచ్చినా తనకు చెప్పాలని కోహ్లీ కోరటమే కాదు.. ఎలాంటి సాయమైనా చేస్తానని చెప్పారట. సురేశ్ రైనా.. అశ్విన్‌లు కూడా సుధీర్‌ని కలిసి అతడిని ఉత్సాహపరిచారట. ఇక.. టీమిండియా జట్టు మేనేజర్ అయితే.. తన నెంబరు ఇచ్చి.. ఏదైనా సమస్య ఉంటే తనకు ఫోన్ చేయాలని చెప్పారట. వీరాభిమానికి జరిగిన దాడిపై టీమిండియా సభ్యులు స్పందిస్తున్న తీరు పలువుర్ని ఆకట్టుకుంటోంది.