Begin typing your search above and press return to search.

పుట్టిన రోజు జరిగిన 4 రోజులకే.. మహిళా క్రికెటర్ సంచలన నిర్ణయం

ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్ యాష్లే గార్ట్ నర్ అంటే ప్రతిభావంతురాలని చెబుతారు.

By:  Tupaki Desk   |   19 April 2024 10:05 AM GMT
పుట్టిన రోజు జరిగిన 4 రోజులకే.. మహిళా క్రికెటర్ సంచలన నిర్ణయం
X

కాలంతో పాటే అభిరుచులు మారుతున్నాయి.. టెక్నాలజీ ఎంత వేగంగా పెరుగుతోందో అంతే వేగంగా పద్ధతులూ మారుతున్నాయి.. స్వేచ్ఛా జీవితానికి పేరుగాంచిన విదేశాల్లో అయితే ఇది మరీనూ.. అక్కడి వ్యక్తులు, వ్యక్తిత్వాలు భిన్నంగా ఉంటాయి. వారు సాధారణ పౌరులైనా.. సెలబ్రిటీలైనా.. ఇంతే. తాజాగా ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్ చేసిన పని చూస్తే.. ఇది నిజమే అనిపిస్తుంది.


మహిళా క్రికెటర్ ఆఫ్ ద ఇయర్

ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్ యాష్లే గార్ట్ నర్ అంటే ప్రతిభావంతురాలని చెబుతారు. గత ఏడాది ఉత్తమ మహిళా క్రికెటర్ అవార్డును ఆమె సొంతం చేసుకున్నారు. వరుసగా రెండు నెలలు ఉత్తమ ప్లేయర్ అవార్డును సొంతం చేసుకున్న ఆస్ట్రేలియా తొలి మహిళా క్రికెటర్ కూడా ఆమెనే. ఈ నెల 15తో 27 ఏళ్లు పూర్తి చేసుకుని 28వ ఏట అడుగుపెట్టింది గార్ట్ నర్.

పుట్టిన రోజు జరిగిన కొద్దిరోజులే

గార్ట్ నర్ పుట్టిన రోజు జరుపుకొన్న నాలుగు రోజులకే సంచలనం నిర్ణయం తీసుకుంది. తన స్నేహితురాలు మోనికా రైట్ తో నిశ్చితార్థం చేసుకుంది. ఈ మేరకు ఇద్దరూ కలిసి దిగిన ఫొటోలను గార్ట్ నర్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. కాగా, గార్ట్ నర్ 20 వ ఏట నుంచి మోనికా రైట్ తో కలిసి ఉంటోంది.. బౌలింగ్ ఆల్ రౌండర్ అయిన గార్ట్ నర్.. ఇండియన్ వుమెన్ ప్రీమియర్ లీగ్ లో గుజరాత్ జెయింట్స్ తరఫున ఆడుతోంది. 6 టెస్టులు, 69 వన్డేలు, 88 టి20ల్లో ఆస్ట్రేలియాకు ప్రాతినిథ్యం వహించింది.