Begin typing your search above and press return to search.

వికెట్ల వెనుక వెన్నుపోటు.. స్లెడ్జింగ్ లో టీమిండియా స్టార్ టాప్

ఓ 20 ఏళ్ల కిందటి వరకు ప్రపంచ క్రికెట్ లో అత్యంత వివాదాస్పద అంశం స్లెడ్జింగ్.

By:  Tupaki Desk   |   5 Oct 2024 4:30 PM GMT
వికెట్ల వెనుక వెన్నుపోటు.. స్లెడ్జింగ్ లో టీమిండియా స్టార్ టాప్
X

ఓ 20 ఏళ్ల కిందటి వరకు ప్రపంచ క్రికెట్ లో అత్యంత వివాదాస్పద అంశం స్లెడ్జింగ్.. మరీ ముఖ్యంగా ఈ కళలో ఆరితేరిన వారు ఆస్ట్రేలియా క్రికెటర్లు. అప్పటి కెప్టెన్లు స్టీవ్ వా, రికీ పాంటింగ్ సహా ఆసీస్ ఆటగాళ్లంతా ఇదో పనిగా పెట్టుకునేవారు. ప్రత్యర్థిని మానసికంగా దెబ్బతీయడం అనే ఉద్దేశం ఇందులో దాగుంది. అయితే, అప్పటికి టి20 లీగ్ లు లేకపోవడంతో అన్ని దేశాల ఆటగాళ్లు కలిపి ఆడే కల్చర్ రాలేదు. ఇప్పుడు కథ మారింది. వివిధ దేశాలకు చెందినవారు టి20 లీగ్ లో ఒకే జట్టుకు ఆడుతుండడంతో అందరిలోనూ స్నేహ భావం పెరిగింది.

అప్పుడు దూషణలు.. ఇప్పుడు ఫ్రెండ్ షిప్ లు

టి20 లీగ్ ల పుణ్యమాని వివిధ దేశాల క్రికెటర్లు సుదీర్ఘ కాలం ఒకే జట్టుకు ఆడుతున్నారు. ఒకే హోటల్ లో ఉండడం, ప్రాక్టీస్ చేయడం, మ్యాచ్ లు ఆడడం తదితరాలతో అందరూ స్నేహితులు అయిపోతున్నారు. తమ దేశానికి వెళ్లినా ఆ స్నేహాన్ని మర్చిపోవడం లేదు. ప్రత్యేక సందర్భాల్లో విష్ చేయడం.. రిటైర్మెంట్ వంటి సమయంలో పొగుడుతూ వీడియోలు, ట్వీట్లు, మెసేజ్ లు పెట్టడం జరుగుతోంది. ఒకప్పుడు మైదానంలో శత్రవులుగా కనిపించినవారు ఇప్పుడు క్లోజ్ ఫ్రెండ్స్ లా మారిపోయారన్నమాట.

కంగారూలకే దడ..

స్లెడ్జింగ్ ఇప్పుడు పూర్తిగా లేదని చెప్పవచ్చు. ఒకప్పుడు అదే పనిగా సాగిన ఈ పద్ధతిలో ఆరితేరారు ఆస్ట్రేలియా క్రికెటర్లు. అలాంటివారికే వణుకు పుట్టించాడట టీమ్ ఇండియా యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్. ఇంతకూ ఏం జరిగిందంటే.. ఆస్ట్రేలియాకు టిమ్ పైన్ కెప్టెన్ గా ఉన్న సయమంలో భారత్ ఆ దేశంలో టెస్టు సిరీస్ కోసం పర్యటించింది. అప్పుడు ఆసీస్ బ్యాటర్లను పంత్ వికెట్ల వెనుక ఉంటూ ఆ ఆటాడుకున్నాడు. ఇది జరిగింది 2018లో. ఆ సిరీస్ ను టీమ్ ఇండియా గెలుచుకుంది.

2018 నాటి సిరీస్ ను ఆసీస్ క్రికెటర్లు తాజాగా గుర్తుచేసుకున్నారు. భారత జట్టులో పంత్ తమను తీవ్రంగా స్లెడ్జింగ్ చేశాడని చెప్పుకొచ్చారు. ఓ ఇంటర్వ్యూలో ఈ విషయం వెల్లడించారు. అయితే, దీనిపై పంత్ కూడా స్పందించాడు. స్లెడ్జింగ్ కు ప్లాన్ అంటూ ఏమీ ఉండదని.. ఆసీస్ ఆటగాళ్లు తనను బేబీ సిట్ చేయాలని చూశారని అందుకే అలా స్పందిచానని చెప్పాడు. తాను మర్యాదగానే స్లెడ్జింగ్ చేశానని కూడా చెప్పడం గమనార్హం.

కొసమెరుపు: 2018 సిరీస్ అనంతరం ఆస్ట్రేలియా అప్పటి ప్రధాని.. భారత వికెట్ కీపర్ పంత్ ను గుర్తించారు. కారణం.. తమ కెప్టెన్ టిమ్ పైన్ తో అంతగా స్లెడ్జింగ్ చేసిన మొనగాడు ఎవరని..?