Begin typing your search above and press return to search.

ఆసీస్ ప్రపంచ కప్ గెలవడానికి ఆ మీటింగే.. టానిక్కా?

ప్రపంచ కప్ లో భాగంగా భారత్ తో తొలి మ్యాచ్ ఆడింది ఆస్ట్రేలియా. అందులో కాస్త పైచేయి సాధించినట్లు కనిపించినా, తేలిగ్గా ఓడిపోయింది.

By:  Tupaki Desk   |   28 Nov 2023 10:59 AM GMT
ఆసీస్ ప్రపంచ కప్ గెలవడానికి ఆ మీటింగే.. టానిక్కా?
X

ఎనిమిది మ్యాచ్ లలో ఆరింటిలో పరాజయం.. జట్టులో సమతూకం కరువు.. ఆటగాళ్లకు గాయాలు.. ప్రపంచ కప్ లో ఓ దశలో పాయింట్ల పట్టికలో కిందన.. కానీ, కప్ ముగిసేసరికి చూస్తే ఆ జట్టే ప్రపంచ చాంపియన్. అది కూడా లీగ్ దశలో తమను ఓడించిన జట్లును సెమీఫైనల్స్ ఫైనల్స్ లో మట్టికరిపించి కప్ కొట్టేసింది. మామలూ జట్లకైతే ఇది సాధ్యం కాదు.. కానీ, అది చాంపియన్ జట్టు అందుకే అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. అత్యంత ఆశ్చర్యకరం ఏమంటే.. ఫైనల్ లో గెలుపునకు ఓ మీటింగ్ టానిక్ లా పనిచేసింది.

ఓటమితో మేల్కొని..

ప్రపంచ కప్ లో భాగంగా భారత్ తో తొలి మ్యాచ్ ఆడింది ఆస్ట్రేలియా. అందులో కాస్త పైచేయి సాధించినట్లు కనిపించినా, తేలిగ్గా ఓడిపోయింది. ఆపై దక్షిణాఫ్రికాతో తలపడింది. అందులో దారుణంగా పరాజయం పాలైంది. మరోవైపు జట్టులో సమతూకం లోపించింది. ఓపెనర్ గా పంపిన మిచెల్ మార్ష్ విఫలమవుతున్నాడు. ఇలాంటి సయమంలో కోచ్‌ ఆండ్రూ మెక్‌ డొనాల్డ్‌ ఓ ప్రయత్నం చేశాడు. వరుస ఓటములతో దెబ్బతిన్న ఆత్మవిశ్వాసాన్ని పునరుద్ధరించుకోవడం కోసం సమావేశం ఏర్పాటు చేశాడు. అందులో తీసుకున్న నిర్ణయాలే ఆసీస్ ను ప్రపంచ చాంపియన్ చేశాయట. లోపాలపై నిజాయతీగా చర్చించుకోవడం ఎంతో మేలు చేసిందట.

వ్యూహంలో కాదు.. ప్రయత్నంలో లోపం

ప్రపంచ కప్ లో పడి లేచిన ఆస్ట్రేలియా తమ వ్యూహాన్నేమీ మార్చుకోలేదట. కేవలం ప్రయత్నాన్ని మార్చిందని మెక్ డొనాల్డ్ వివరించాడు. ఇంకా తీవ్రంగా ప్రయత్నించాలని.. సరైన మార్గంలోనే ఉన్నామని భావిస్తూ ముందుకెళ్లినట్లు తెలిపాడు. లక్ష్యాన్ని సాధిస్తామని పెంచుకున్న నమ్మకమే గెలుపు అందించిందని వివరించాడు. క్రమంగా తమ వ్యూహం ఫలాలను ఇవ్వడం మొదలుపెట్టిందన్నాడు. కాగా, ఇక్కడ చిత్రమేమంటే.. భారత్ తో టెస్టు సిరీస్ లో అనుసరించే పద్ధతే ప్రపంచ కప్ లో వారికి ఉపయోగపడిందని మెక్ డొనాల్డ్ చెప్పాడు. భారత్ తో సిరీస్ లో 0-2 తేడాతో వెనుకబడిన సందర్భంలో జట్టును ఏకతాటిపైకి తీసుకొచ్చి.. తొలుత నిర్దేశించిన వ్యూహాన్ని అనుసరించామని చెప్పాడు. వ్యూహాన్ని పూర్తిగా మారిస్తే అది జట్టులో భయాన్ని, ఆందోళనను పెంచుతుందని మూలాలకు కట్టుబడినట్లు పేర్కొన్నాడు.

నవ విజయాలతో ఆరోసారి చాంపియన్

దక్షిణాఫ్రికాతో మ్యాచ్ తర్వాత ఏర్పాటు చేసిన సమావేశం ఆసీస్ ప్రపంచ కప్ ప్రయాణాన్నే మార్చిందనడంలో సందేహం లేదు. ఆ తర్వాత వరుసగా

9 మ్యాచ్‌ లలో కంగారూలు గెలిచారు. అఫ్గానిస్థాన్‌ తో ఓటమి అంచు వరకు వెళ్లిన ఆస్ట్రేలియా.. ఆల్ రౌండర్ మ్యాక్స్‌ వెల్‌ అద్భుత డబుల్ సెంచరీతో గెలవడం కూడా.. తీవ్రంగా ప్రయత్నించాలనే వ్యూహానికి కట్టుబడిన ఫలితమేనని స్పష్టమవుతోంది. వాస్తవానికి ఆసీస్ కోచ్ చేసినది సాహసమే అని చెప్పాలి. రెండు మ్యాచ్ లు అదీ.. పెద్ద జట్ల చేతిలో ఓడాక కూడా వ్యూహాన్ని మార్చకుండా అతడు ముందుకెళ్లడం అంటే మొండితనంగానే భావించాలి. ఆస్ట్రేలియా లాంటి జట్టు కాబట్టి ఈ విధానం సరిపోయింది. మిగతా జట్లకైతే కష్టమే