Begin typing your search above and press return to search.

నిన్న కోచ్.. నేడు కెప్టెన్.. పాక్ ఓటమికి ఆ కారణాలు చెబుతున్నారు!

ఈ బాల్ షంసి ప్యాడ్స్ కి తగలగా పాకిస్థాన్ ఎల్బీ అప్పీలు చేసింది. అయితే అంపైర్ నాటౌట్‌ గా ప్రకటించాడు. దీంతో... పాకిస్థాన్ డీఆరెస్ కు వెళ్లింది.

By:  Tupaki Desk   |   28 Oct 2023 9:52 AM GMT
నిన్న కోచ్.. నేడు కెప్టెన్..  పాక్  ఓటమికి  ఆ  కారణాలు చెబుతున్నారు!
X

వన్డే ప్రపంచకప్‌ లో పాకిస్థాన్‌ కథ దాదాపు ముగిసిపోయిందనే అనుకోవాలి. తాజాగా దక్షిణాఫ్రికాతో మ్యాచ్ లో ఓటమిపాలవ్వడంతో ఇక సెమీస్‌ కు చేరుతుందనే నమ్మకం లేదు! దురదృష్టం అనేది ఉంటే అది వెంటాడుతుందో.. లేక, అక్రం చెప్పినట్లు ఫిట్ నెస్ లేమితో బాదపడుతున్నారా అనేదానిపై పూర్తి స్పష్టత లేనప్పటికీ పాక్ కి మాత్రం ఈ వరల్డ్ కప్ లో షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజా ఓటమికి కారణం చెబుతూ.. నేరం మాది కాదు అంపైది అన్నట్లుగా స్పందించాడు!

అవును... దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో ఓ దశలో ఓటమి ఖాయమైనట్లు కనిపించినపప్టికీ.. పాక్ బౌలర్లు అద్భుతంగా మ్యాచ్ పై పట్టుసాధించారు. అయితే.. చివరి వికెట్‌ విషయంలో అంపైర్‌ నిర్ణయం పాక్‌ కు ప్రతికూలంగా మారిందని అంటున్నాడు కెప్టెన్ బాబర్! హారిస్ రవూఫ్‌ బౌలింగ్‌ లో 46 ఓవర్ చివరి బంతికి బ్యాటర్ షంసి ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఇక్కడే ఈ వరల్డ్ కప్ లో పాకిస్థాన్ రాత ఒక్కసారిగా మారిపోయింది.

ఈ బాల్ షంసి ప్యాడ్స్ కి తగలగా పాకిస్థాన్ ఎల్బీ అప్పీలు చేసింది. అయితే అంపైర్ నాటౌట్‌ గా ప్రకటించాడు. దీంతో... పాకిస్థాన్ డీఆరెస్ కు వెళ్లింది. అక్కడ కూడా "అంపైర్స్‌ కాల్" అని రావడంతో బ్యాటర్ సేఫ్.. పాక్ బలి! లేకపోతే పాకిస్థాన్‌ కచ్చితంగా విజయం సాధించేదని అంటున్నారు. ఈ క్రమంలో పాకిస్థాన్‌ కెప్టెన్ బాబర్ అజాం మ్యాచ్ అనంతరం తన ఆవేదన చెప్పుకున్నాడు!

ఇందులో భాగంగా... మ్యాచ్‌ లో విజయానికి చాలా చేరువగా వచ్చాం కానీ.. ఫినిష్‌ సరిగా చేయలేకపోయామని.. ఫలితంగా దక్కిన ఈ ఓటమి జట్టును తీవ్ర నిరాశకు గురి చేసిందని బాబర్ ఆజాం చెప్పుకొచ్చాడు. ఇదే సమయంలో... బ్యాటింగ్‌ లో 15 పరుగులు తక్కువగా చేసినప్పటికీ.. పాక్ బౌలర్లు పుంజుకున్న తీరు మాత్రం అద్భుతం అని.. ఐతే వారి పోరాటం సరిపోలేదని అన్నడు.

ఇక... దురదృష్టవశాత్తూ అంపైరింగ్‌ నిర్ణయాలు కూడా తమకు అనుకూలంగా రాలేదని చెబుతున్న బాబర్... డీఆరెస్స్ తీసుకున్నా కూడా ఫలితం అనుకూలంగా మారలేదని.. ఒకవేళ అంపైర్‌ ఔట్‌ ఇచ్చి ఉంటే మాకు ఫేవర్‌ గా వచ్చేదని అన్నాడు. అనంతరం.. ఇవన్నీ గేం లో భాగమే అని సర్ధిచెప్పుకున్నాడు!!

కాగా ఈ వరల్డ్ కప్ లో పాకిస్థాన్ కు ఇది నాలుగో పరాజయం. భారత్ తో మొదలైన పాక్ పరాజయాల యాత్ర ఆస్ట్రేలియా, అఫ్గానిస్థాన్‌ లతో కొనసాగి తాజాగా దక్షిణాఫ్రికా దగ్గరకు వచ్చి చేరింది. దీంతో పాక్ ఖాతాలో ప్రస్తుతం నాలుగు పాయింట్లు మాత్రమే ఉన్నాయి. రెండు విజయాలు, నాలుగు ఓటములతో పాయింట్ట పట్టికలో ఆరో స్థానంలో కొనసాగుతోంది.

మరోపక్క భారత్ తో మ్యాచ్ ఓటమి అనంతరం పాక్ కోచ్ స్పందిస్తూ... ఇది ఐసీసీ మ్యాచ్ లా అనిపించలేదని, స్టేడియంలో నూటికీ 90శాతం ప్రేక్షకులు బ్లూ జెర్సీలు ధరించే ఉన్నారని, పాక్ కు ఎంకరేంజ్ మెంట్ లేకపోవడం కూడా ఓటమికి ఒక కారనం అని చెప్పుకొచ్చాడు. దీనిపై అక్రం వంటి పాక్ సీనియర్లు ఫైరయ్యారు. సాకులు మాని పనిపై శ్రద్ధపెట్టండన్నట్లుగా కౌంటర్ ఇచ్చిన సంగతి తెలిసిందే!