Begin typing your search above and press return to search.

హీరోయిన్లు, టాటూలు... సెలక్షన్ కమిటీని తగులుకున్న సీఎస్కే మాజీ బ్యాటర్!

అవును... శ్రీలంకతో జరిగే టీ20, వన్డేలకు ప్రకటించిన టీమిండియా జట్టుపై పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   22 July 2024 3:44 AM GMT
హీరోయిన్లు, టాటూలు... సెలక్షన్  కమిటీని  తగులుకున్న సీఎస్కే మాజీ బ్యాటర్!
X

శ్రీలంకతో టీ20, వన్డేలకు ప్రకటించిన టీమిండియా జట్టుపై పలువురు తమ అసంతృప్తిని బహిరంగంగా వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటికే వన్డే సిరీస్ కు సంజూ శాంసన్, టీ20లకు అభిషేక్ శర్మను ఎంపీక చేయకపోవడంపై సెక్షన్ కమిటీపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో తాజాగా బద్రీనాథ్ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు.

అవును... శ్రీలంకతో జరిగే టీ20, వన్డేలకు ప్రకటించిన టీమిండియా జట్టుపై పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రధానంగా ఇటీవల అద్భుతంగా రాణిస్తున్న సంజూ శాంసన్, రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ వంటి ఆటగాళ్లను పక్కన పెట్టడం, ఊహించని విధంగా కొంతమందికి జట్టులో చోటు దక్కడం అనే అంశాలపై పలువురు స్పందిస్తున్నారు.

ఈ సందర్భంగా సెలక్షన్ కమిటీపై బహిరంగంగానే కామెంట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో... చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ ను సెలక్షన్ కమిటీ ఎంపిక చేయకపోవడంపై సీఎస్కే మాజీ బ్యాటర్ బద్రీనాథ్ ఘాటుగా స్పందించారు. ఈ సందర్భంగా బాలీవుడ్ హీరోయిన్లతో రిలేషన్ షిప్, బాడీ మొత్తం టాటూలు వంటి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఇందులో భాగంగా... టాలెంటెడ్ ప్లేయర్స్ జట్టుకు ఎంపిక కానప్పుడు ఆటగాళ్లు బ్యాడ్ బాయ్ ఇమేజ్ కలిగి ఉండటం అనవసరం అనిపిస్తుందని.. జట్టుకు రెగ్యులర్ గా ఎంపిక కావాలంటే బాలీవుడ్ హీరోయిన్లతో రిలేషన్ షిప్ ఉండాలేమో.. ఒళ్లంత టాటూలువే యించుకోవాలేమో.. లేదా, మంచి మీడియా మేనేజర్ ను కలిగి ఉండాలేమో అని బద్రీనాథ్ వ్యగంగా అన్నాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారుతుంది.

కాగా... ఇటీవల ముగిసిన టీ20 వరల్డ్ కప్ జట్టులోనూ రుతురాజ్ కు చోటు దక్కని సంగతి తెలిసిందే. అయితే.. ఆ తర్వాత జింబాబ్వేతో జరిగిన టీ20 సిరీస్ లో రుతురాజ్ ఆడాడు. రెండు మ్యాచ్ ల్లో 77, 49 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. ఇలా జట్టు విజయాల్లో కీలక భూమిక పోషించినప్పటికీ అతడిని శ్రీలంక టూర్ కు ఎంపిక చేయకపోవడంపై రకరకాల విమర్శలు తెరపైకి వస్తున్నాయి.