Begin typing your search above and press return to search.

ప్రైజ్ మనీ కంటే 3 రెట్ల నజరానా.. టీమ్ ఇండియాకు బీసీసీఐ బొనాంజా

దీంతో రోహిత్ శర్మ నాయకత్వంలోని భారత జట్టుపై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) భారీ నజరానా కురిపించింది.

By:  Tupaki Desk   |   20 March 2025 1:36 PM IST
ప్రైజ్ మనీ కంటే 3 రెట్ల నజరానా.. టీమ్ ఇండియాకు బీసీసీఐ బొనాంజా
X

టెస్టుల్లో టీమ్ ఇండియా చాలా పటిష్ఠ జట్టు.. టి20ల్లో ప్రపంచ చాంపియన్.. మరి వన్డేల్లో? సొంతగడ్డపై 2023లో జరిగిన ప్రపంచ కప్ లో ఫైనల్ చేరినా కప్ నెగ్గలేకపోయింది.. 2011 తర్వాత అసలు వన్డే ప్రపంచ చాంపియన్ కాలేకపోయింది.. అలాంటి టీమ్ ఇండియాను ఇటీవలి చాంపియన్స్ ట్రోఫీ మళ్లీ చాంపియన్ ను చేసింది.

మాజీ చాంపియన్లు అయిన వెస్టిండీస్, శ్రీలంకలు లేకున్నా 8 మేటి జట్లు.. పోటీ పడిన చాంపియన్స్ ట్రోఫీని టీమ్ ఇండియా ఒక్క ఓటమి కూడా లేకుండా గెలుచుకుంది. దీంతో 2013 తర్వాత చాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచిన రికార్డును సొంతం చేసుకుంది.

15 మందికి, సహాయ సిబ్బంది రూ.58 కోట్లు..

దీంతో రోహిత్ శర్మ నాయకత్వంలోని భారత జట్టుపై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) భారీ నజరానా కురిపించింది. 15 మంది జట్టు సభ్యులు, సహాయక సిబ్బందికి రూ.58 కోట్ల నగదు రివార్డు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. గత ఏడాది జూన్ లో టి20 ప్రపంచ కప్, ఇప్పుడు చాంపియన్స్ ట్రోఫీ.. వరుసగా రెండు ఐసీసీ టైటిల్స్ సాధించినందుకు ఆటగాళ్లను కొనియాడింది. వారి శ్రమను గుర్తించడంగా దీనిని అభివర్ణించింది.

కాగా, చాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచిన భారత్ కు రూ.19.50 కోట్ల ప్రైజ్‌మనీ లభించింది. ఫైనల్‌ లో ఓడిన న్యూజిలాండ్ కు రూ.9.70 కోట్ల దాక దక్కాయి.