ప్రపంచ కప్ చరిత్రలో సంచలన విజయాలు ఇవే
అండర్ డాగ్ గా బరిలోకి దిగిన జట్టు సైతం డిపెండింగ్ ఛాంపియన్ ను మట్టి కరిపిస్తున్న వైనం సంచలనం రేపుతోంది.
By: Tupaki Desk | 16 Oct 2023 2:10 PM GMTతాజాగా జరుగుతున్న వన్డే క్రికెట్ ప్రపంచ కప్ లో అన్ని జట్లు నువ్వా నేనా అన్నట్లు పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. ఈ మెగా టోర్నీలో ప్రతి విజయం కీలకం కావడంతో ప్రతి మ్యాచ్ గెలవాలన్న దృఢ సంకల్పంతో పెద్దా...చిన్న అని తేడా లేకుండా అన్ని జట్లు శాయశక్తులు ఒడ్డి బరిలోకి దిగుతున్నాయి. తమ శక్తి మేరకు రాణించి కప్పును ఎగరేసుకుపోవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే, ఈ టోర్నీలో హాట్ ఫేవరెట్ట్లుగా బరిలోకి దిగిన కొన్ని జట్లు చిన్న జట్ల చేతిలో ఖంగుతున్న వైనం ఆసక్తికరంగా మారింది.
అండర్ డాగ్ గా బరిలోకి దిగిన జట్టు సైతం డిపెండింగ్ ఛాంపియన్ ను మట్టి కరిపిస్తున్న వైనం సంచలనం రేపుతోంది. గత ఏడాది ప్రపంచ కప్ టైటిల్ ని గెలుచుకున్న డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ ను అండర్ డాగ్ గా బరిలోకి దిగిన అప్ఘానిస్థాన్ జట్టు ఓడించడం షాకింగ్ గా మారింది. అయితే, ఇలా అండర్ డాగ్స్ గా బరిలోకి దిగిన జట్లు అగ్రశ్రేణి జట్లకు షాక్ ఇవ్వడం గతంలో కూడా జరిగింది. ఇంకా చెప్పాలంటే ఈ ట్రెండ్ మొదలుపెట్టింది టీమిండియానే కావడం విశేషం.
1983 వరల్డ్ కప్ లో అండర్ డాగ్ గా ఏ మాత్రం అంచనాలు లేకుండా దాకా బరిలోకి దిగిన భారత జట్టు...హ్యాట్రిక్ టైటిల్ వేటలో ఉన్న వెస్టిండీస్ జట్టుకు షాక్ ఇచ్చింది. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, వెస్ట్ ఇండీస్ వంటి మేటి జట్లను చిత్తుచేసి తొలిసారిగా మన దేశానికి వరల్డ్ కప్ సాధించింది. ఇక, 1983 లోనే బలమైన ఆస్ట్రేలియా జట్టును పసికూన జింబాబ్వే ఓడించింది. 1996 ప్రపంచ కప్ లో బలమైన వెస్టిండీస్ జుట్టును కెన్యా ఓడించి షాక్ ఇచ్చింది. టెస్ట్ హోదాలో ఉన్న ఒక జట్టును టెస్టు హోదా లేని జట్టు ఓడించడం అదే తొలిసారి.
అదే టోర్నీలో పాకిస్తాన్ జట్టును పసికూన బంగ్లాదేశ్ ఖంగు తినిపించింది. ఇదే, బంగ్లాదేశ్ జట్టు 2007లో టీమిండియాకు గట్టి షాక్ ఇచ్చింది. 2011 ప్రపంచ కప్ లో ఇంగ్లండ్ పై దాయాది దేశం ఐర్లాండ్ సంచలన విజయం నమోదు చేసింది. ఆ మ్యాచ్ లోనే ఐర్లాండ్ ఆటగాడు కెవిన్ ఓ బ్రెయిన్ 50 బంతుల్లో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు నమోదు చేశాడు. 2023 వరల్డ్ కప్ అయిపోయే లోపు ఎన్ని సంచలనాలు నమోదవుతాయో వేచి చూడాలి.