Begin typing your search above and press return to search.

13 ఏళ్లకే ఐపీఎల్ వేలంలోకి.. ఎవరీ బిహారీ బాలుడు..?

లేదా నార్త్ ఇండియా ప్రభావం కనిపిస్తుంది.. కానీ, ప్రతిభ ఉంటే ఇవేవీ అడ్డుకోలేవు.

By:  Tupaki Desk   |   16 Nov 2024 5:30 PM GMT
13 ఏళ్లకే ఐపీఎల్ వేలంలోకి.. ఎవరీ బిహారీ బాలుడు..?
X

13 ఏళ్లు.. సాధారణంగా ఈ వయసు పిల్లలు అప్పుడే కోచింగ్ సెంటర్లకు క్రికెట్ అకాడమీలకు వెళ్తుంటారు... లేదా పోటీ పరీక్షలకు ముందస్తుగానే సిద్ధం అవుతుంటారు.. కానీ, అతడు రంజీ క్రికెట్ ఆడేశాడు.. అండర్ 19 ప్రపంచ కప్ కూడా ఆడేశాడు.. మిగిలింది టీమ్ ఇండియా గడప తొక్కడమే.. ఆ దిశగా మొదటి అడుగు అయిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వైపు అడుగేశాడు.

ముంబైకర్ కాదు.. బిహారీ

భారత క్రికెట్ లో సహజంగా ముంబై డామినేషన్ ఉంటుంది. లేదా నార్త్ ఇండియా ప్రభావం కనిపిస్తుంది.. కానీ, ప్రతిభ ఉంటే ఇవేవీ అడ్డుకోలేవు. దీనికి నిదర్శనమే బిహార్ వంటి వెనుకబడిన రాష్ట్రం నుంచి ఇప్పుడు జాతీయ స్థాయిలో పేరు మార్మోగుతున్న వైభవ్ సూర్య వంశీ. 13 ఏళ్ల సూర్య వంశీ భవిష్యత్ క్రికెట్ స్టార్ గా పేరు తెచ్చుకున్నాడు. అతడు కష్టపడి, క్రమశిక్షణతో ఉంటే ఇది సాధ్యమే.

ఎవరీ రఘువంశీ..

బిహార్‌ రాష్ట్రం తాజ్‌పుర్ గ్రామానికి చెందినవాడు వైభవ్ సూర్యవంశీ. 2011లో పుట్టిన ఇతడు నాలుగేళ్ల వయసుకే బ్యాట్‌ పట్టాడు. దీంతో వైభవ్ కు క్రికెట్ అంటే ఆసక్తి ఉందని గమనించిన అతడి తండ్రి సంజీవ్ సూర్యవంశీ ఏకంగా సొంత మైదానమే సిద్ధం చేశాడు. 2019 నాటికి.. అంటే 8 ఏళ్లు వచ్చేసరికి సమస్తిపుర్‌ లోని క్రికెట్ అకాడమీలో చేర్పించాడు. రెండేళ్ల శిక్షణలోనే వైభవ్ బిహార్ అండర్-16 జట్టులోకి ఎంటర్ అయ్యాడు. అంటే 10 ఏళ్లకే 16 ఏళ్ల విభాగంలో ఆడాడు.

లెఫ్టీ వైభవ్.. ఏ జట్టుకో?

ఓపెనర్ అయిన వైభవ్ సూర్యవంశీ దూకుడైన ఎడమ చేతివాటం బ్యాట్స్ మన్. బౌలింగ్‌ కూడా వేస్తాడు. ఈ ఏడాదిలోనే ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌ లోకి వచ్చాడు. ఐదు మ్యాచ్‌ లు ఆడాడు. తనదైన శైలిలో.. ఫీల్డర్ల మధ్యలోంచి బౌండరీలు కొట్టడం వైభవ్ కు ఉన్న ప్రత్యేకత. వైభవ్ పేరును తాజాగా మెగా వేలం షార్ట్ లిస్ట్ లో పెట్టింది ఐపీఎల్ మేనేజ్ మెంట్. రూ.30 లక్షల బేస్‌ ప్రైస్‌ తో పేరును ఎంట్రీ చేయించిన వైభవన్ ను ఏ ఫ్రాంచైజీ తీసుకున్నా సంచలనమే. కాగా, 1988లో 16 ఏళ్ల వయసులో టీమ్ ఇండియాలో వచ్చాడు సచిన్ టెండూల్కర్. ఆ తర్వాత అతడు వెనక్కు తిరిగిచూసుకోలేదు. ఎవరూ అందుకోలేని రికార్డులను నెలకొల్పాడు. మరి వైభవ్..మరో రెండేళ్లకు టీమ్ ఇండియాలోకి వచ్చినా అది రికార్డే.