Begin typing your search above and press return to search.

నిషేధం అంచున ప్రపంచ ఫుట్ బాల్ దిగ్గజ జట్టు..?

ఫుట్ బాల్ ప్రపంచ విజేతగా ఒక్కసారి నిలవడమే కష్టం. క్రిస్టియానో రొనాల్డో వంటి సూపర్ స్టతార్ ఉన్నప్పటికీ పోర్చుగల్ రెండు దశాబ్దాలుగా చాంపియన్ కాలేకపోతోంది.

By:  Tupaki Desk   |   26 Dec 2023 9:22 AM GMT
నిషేధం అంచున ప్రపంచ ఫుట్ బాల్ దిగ్గజ జట్టు..?
X

ప్రపంచంలో ఎన్ని జట్లయినా ఫుట్ బాల్ ఆడొచ్చు.. కానీ ఆ జట్టు మైదానంలో ఉంటే.. ఆ కళే వేరు.. వారు పాస్ లు ఇచ్చుకునే విధానం.. సమన్వయంతో కదిలే తీరు.. గోల్స్ చేసే పద్ధతి.. గెలుపు అనంతరం సంబరాలు.. అన్నిటికి మించి పసుపు రంగు జెర్సీల్లో వారు కదులుతుంటేనే అదో పండుగ... కానీ, అలాంటి జట్టు వచ్చే ప్రపంచ కప్ లో కనిపించకపోవచ్చు.. అభిమానులను అలరింకచకపోవచ్చు.. ఇది వంద శాతం జరుగుతుందని చెప్పలేం కానీ.. పరిస్థితులు అలాగే ఉన్నాయి..

మహా స్ట్రిక్టు ఫట్ బాల్ అసోసేయషన్

ఒలింపిక్ అసోసియేషన్.. అంతర్జాతీయ క్రికెట మండలి.. ఇలా ఏ క్రీడ తీసుకున్నా.. వాటి సంఘాలు నిబంధనల విషయంలో చాలా కఠినంగా ఉంటాయనే సంగతి తెలిసిందే. టీవల ప్రపంచ కప్ పరాజయం అనంతరం శ్రీలంక బోర్డు విషయంలో ఆ దేశ ప్రభుత్వం ప్రవర్తించిన తీరును అంతర్జాతీయ క్రికెట్ మండలి తీవ్రంగా తప్పుబడుతూ లంక టీమ్ పై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అయితే, వీటికి మించి స్ట్రిక్టుగా వ్యవహరిస్తుంది అంతర్జాతీయ ఫుట్ బాల్ సంఘం (ఫిఫా). ఏదైనా దేశ ఫుట్ బాల్ సంఘం వ్యవహారాల్లో రాజకీయ జోక్యం ఎక్కువైతే ఏమాత్రం సహించదు. ఇలాంటి పరిస్థితుల్లోనే ప్రపంచ మాజీ చాంపియన్ బ్రెజిల్ పై చర్యలు తీసుకోనున్నట్లు కనిపిస్తోంది.

అత్యంత ఆదరణ.

ఫుట్ బాల్ ప్రపంచ విజేతగా ఒక్కసారి నిలవడమే కష్టం. క్రిస్టియానో రొనాల్డో వంటి సూపర్ స్టతార్ ఉన్నప్పటికీ పోర్చుగల్ రెండు దశాబ్దాలుగా చాంపియన్ కాలేకపోతోంది. కానీ, బ్రెజిల్ మరే జట్టుకూ సాధ్యం కానట్లుగా ఐదుసార్లు ప్రపంచ చాంపియన్ గా నిలిచింది. అర్జెంటీనా, జర్మనీ సహా మరే జట్టు కూడా దీనికి దగ్గరగా లేవనేది నిజం. అలాంటి బ్రెజిల్‌ ఫుట్‌బాల్‌ జట్టు నిషేధం ముప్పు అంచున నిలిచింది. బ్రెజిల్ ఫుట్‌బాల్‌ వ్యవహారాల్లో బయటి జోక్యాన్ని ప్రశ్నిస్తూ ఫిఫా లేఖ రాసింది. సమాఖ్యలో సంక్షోభాన్ని వీలైనంత త్వరగా పరిష్కరించుకోకపోతే బ్రెజిల్‌ జాతీయ జట్లు, క్లబ్‌ లు అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనకుండా నిషేధం విధిస్తామని హెచ్చరించింది.

ఫుట్ బాల్ ఎన్నికల్లో అక్రమాలతో..

నిరుడు జరిగిన బ్రెజిల్‌ ఫుట్‌బాల్‌ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయంటూ ఆరోపణలు వచ్చాయి. దీనిపై కోర్టు కేసులు నమోదయ్యాయి. చివరకు ఈ నెల 7న సమాఖ్య అధ్యక్షుడు ఎడ్నాల్డో రోడ్రిగ్స్‌ను బ్రెజిల్ రాజధాని రియో డిజనీరో కోర్టు తొలగించింది. జనవరి 7 (30 రోజుల్లో) లోగా మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది. అయితే, ఈ తీర్పుపై బ్రెజిల్‌ అత్యున్నత న్యాయస్థానానికి వెళ్లగా.. కింది కోర్టు తీర్పునే సమర్థించింది. ఆ కారణంగానే బ్రెజిల్‌ను ఫిఫా హెచ్చరించింది. కాగా, సభ్య దేశాల సంఘాల్లో ప్రభుత్వంతో పాటు బయటివారు ఎవరు జోక్యం చేసుకున్నా ఫిఫా సహించదు. ఒకవేళ బ్రెజిల్‌ సమాఖ్యను సస్పెండ్‌ చేస్తే.. అయిదుసార్లు విజేత బ్రెజిల్‌ జట్టు, సంక్షోభానికి తెరపడే వరకు ప్రధాన టోర్నీలకు దూరం కావడం ఖాయం.