Begin typing your search above and press return to search.

ఐపీఎల్-18.. 4 బంతులకో ఫోర్.. 10 బంతులకో సిక్సర్.. రికార్డులు బద్దలు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అంటేనే రికార్డుల పరంపర.. హద్దుల్లేని ఆనందం.. బౌండరీలు దాటే సంతోషం.. పోటెత్తే అభిమానులు.. బ్యాట్స్ మెన్ లీగ్ గానే ముద్రపడినా బౌలర్లకూ సత్తా చాటే చాన్సుండడం మన లీగ్ గొప్పదనం.

By:  Tupaki Desk   |   27 March 2025 12:16 PM
Will Srh smash Lsg
X

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అంటేనే రికార్డుల పరంపర.. హద్దుల్లేని ఆనందం.. బౌండరీలు దాటే సంతోషం.. పోటెత్తే అభిమానులు.. బ్యాట్స్ మెన్ లీగ్ గానే ముద్రపడినా బౌలర్లకూ సత్తా చాటే చాన్సుండడం మన లీగ్ గొప్పదనం.

ఏడాది మారిన కొద్దీ ఐపీఎల్ మరింత పదునెక్కుతోంది.. అప్పుడెప్పుడో తొలి సీజన్ లో మెక్ కల్లమ్ విధ్వంసాన్ని చూసే అమ్మో అనుకుంటే.. ఇప్పుడు అంతకుమించిన మొనగాళ్లు అభిషేక్ శర్మ రూపంలో వచ్చారు..

200 కొడితేనే బాబోయ్ అనుకున్న రోజుల నుంచి ఇప్పుడు ఏకంగా 300కు దగ్గరయ్యే స్థాయికి ఎదిగింది ఐపీఎల్. ఒక్క సెంచరీ నమోదైతేనే గొప్పగా చెప్పుకొనే రోజుల నుంచి ప్రతి మ్యాచ్ లో సెంచరీ దగ్గరగా వచ్చే పరిస్థితికి చేరింది.

అనేక మార్పులతో వచ్చిన 18వ సీజన్ ఇప్పటికే ఐదు రోజులు ముగించుకుంది. గత శనివారం ఒక మ్యాచ్, ఆదివారం రెండు, సోమ, మంగళ, బుధవారాల్లో మొత్త ఆరు మ్యాచ్ లు జరిగాయ. వీటిలో బుధవారం నాటి కోల్ కతా నైట్ రైడర్స్-రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ మాత్రమే సాదాసీదాగా సాగింది.

మంగళవారం నాటి చూస్తే మొత్తం ఐదు మ్యాచ్ లకు గాను 3.9 బంతులకో ఫోర్.. 9.9 బంతులకో సిక్సర్ నమోదైంది. లీగ్ ప్రారంభమైన తర్వాత ఈ స్థాయిలో బౌండరీల వరద ఇదే మొదటిసారి కావడం గమనార్హం. మంగళవారం వరకు జరిగిన మ్యాచ్ లలో కనీసం 20 పైగా పరుగులు నమోదైన ఓవర్లు 20 ఉన్నాయి. తక్కువ స్కోరు నమోదైన బుధవారం నాటి మ్యాచ్ ను కూడా పరిగణిస్తే ప్రతి 4 బంతులకు ఒక ఫోర్, ప్రతి 10 బంతులకు ఒక సిక్స్ నమోదైనట్లుగా పరిగణించాలి.

300 కొట్టాలి 3 బంతులకో బౌండరీ రావాలి

సన్ రైజర్స్ హైదరాబాద్ గురువారం లక్నో సూపర్ జెయింట్స్ తో హైదరాబాద్ ఉప్పల్ లో తలపడనుంది. మాంచి ఊపు మీదున్న సన్ రైజర్స్ అసలే బలహీన బౌలింగ్ ఉన్న లక్నోపై చెలరేగి ఆడితే అప్పుడు గురువారం నాటికి 3 బంతులకో బౌండరీ, 9 బంతులకో సిక్సర్ స్థాయికి రికార్డులు చేరతాయి. మరి సన్ రైజర్స్ 300 కొడుతుందా.. రికార్డులను 3 బంతులకో బౌండరీకి సరిచేస్తుందా? చూద్దాం.