చెన్నై వర్సెస్ కోల్ కతా... ఆసక్తికరంగా చెపాక్ పిచ్ రిపోర్ట్!
చిదంబరం స్టేడియం అటు బ్యాటర్లు, ఇటు బౌలర్లకు కూడా సమాన అవకాశాలను అందిస్తుంది. ఇందులో భాగంగా... ఫస్ట్ ఇన్నింగ్స్ లో బ్యాటర్లకు, సెకండ్ ఇన్నింగ్స్ లో ఫేసర్లకు సహకరిస్తుంది
By: Tupaki Desk | 8 April 2024 5:16 AM GMTఐపీఎల్ సీజన్ 17లో 22 మ్యాచ్ చెన్నై – కోల్ కతా మధ్య జరగబోతోంది. ఈ రసవత్తరమైన మ్యాచ్ కోసం చెన్నైలోని చిదంబరం స్టేడియం ముస్తాబయ్యింది. వరుసగా ఆడిన మూడు మ్యాచ్ లలోనూ గెలిచిన కోల్ కతా ఫుల్ జోష్ లో ఉండగా.. ఆడిన నాలుగు మ్యాచ్ లలోనూ తొలి రెండింట గెలిచిన చెన్నై.. గత రెండు మ్యాచ్ లలోనూ వరుసగా ఓటమి చవిచూస్తోంది. ఈ నేపథ్యంలో... మూడో ఓటమికి అడ్డుకట్ట వేయాలనే కసిలో ఉంది.
అవును... రుతురాజ్ గైక్వాడ్ నేతృత్వంలోని చెన్నై... గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు లపై తమ మొదటి 2 మ్యాచ్ లలో విజయం సాధించగా.. ఆ తర్వాత, ఢిల్లీ క్యాపిటల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన రెండు మ్యాచ్ ల్లో వరుసగా ఓడిపోయింది. మరోవైపు కోల్ కతా ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్ ల్లోనూ విజయం సాధించి 2.518 నెట్ రన్ రేట్ తో రెండో ప్లేస్ లో నిలిచింది.
చెన్నై బ్యాటర్స్ లో శివం దుబె ఆడిన నాలుగు మ్యాచ్ లలోనూ 148 పరుగులు చేయగా.. అజింక్యా రహానే 119, రచిన్ రవీంద్ర 97 పరుగులు సాధించారు. ఇక బౌలర్లలో మూడు మ్యాచ్ లు ఆడిన ముస్తాఫిజూర్ 7 వికెట్లు పడగొట్టగా.. మతీషాపతిరాణా 2 మ్యాచ్ లు ఆడి 4 వికెట్లు తీశాడు.
ఇక కోల్ కతా విషయానికొస్తే... 3 మ్యాచ్ లలో సునీల్ నరైన్ 134 పరుగులు చేయగా.. ఆడ్రూ రస్సెల్ 105, సాల్ట్ 102 పరుగులు సాధించారు. ఇక బౌలింగ్ డిపార్ట్మెంట్ కి వచ్చే సరికి హర్షిత్ రాణా 3 మ్యాచ్ లలోనూ 5 వికెట్లు, ఆండ్రూ రస్సెల్ 5 వికెట్లు పడగొట్టారు.
హెడ్ టు హెడ్ రికార్డులు:
చెన్నై, కోల్ కతా జట్లు ఇప్పటి వరకు 29 ఐపీఎల్ మ్యాచ్ లు ఆడాయి. వీటిలో చెన్నై సూపర్ కింగ్స్ 18 మ్యాచ్ లలో గెలవగా.. కోల్ కతా నైట్ రైండర్స్ 10 మ్యాచ్ లలో విజయం సాధించింది. ఒక మ్యాచ్ ఎలాంటి ఫలితాలను ఇవ్వలేదు. ఇక కేకేఆర్ పై ఇప్పటివరకు చెన్నై అత్యధిక స్కోరు 235 కాగా... చెన్నై పై కోల్ కతా అత్యధిక స్కోరు 202.
పిచ్ రిపోర్ట్:
చిదంబరం స్టేడియం అటు బ్యాటర్లు, ఇటు బౌలర్లకు కూడా సమాన అవకాశాలను అందిస్తుంది. ఇందులో భాగంగా... ఫస్ట్ ఇన్నింగ్స్ లో బ్యాటర్లకు, సెకండ్ ఇన్నింగ్స్ లో ఫేసర్లకు సహకరిస్తుంది! ఈ మైదానంలో ఇప్పటివరకూ ఫేసర్లు 516 వికెట్లు తీయగా.. స్పిన్నర్లు 336 వికెట్లు తీశారు. ఇక ఇక్కడ ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోరు 164.