Begin typing your search above and press return to search.

చరిత్రలో తొలిసారి మనోళ్లకు 2 స్వర్ణాలు

అవును.. మనోళ్లు అదరగొట్టేశారు. చరిత్రలో తొలిసారి మన భారత చెస్ క్రీడాకారులు విదేశీ వేదిక మీద చెలరేగిపోయారు.

By:  Tupaki Desk   |   23 Sep 2024 3:55 AM GMT
చరిత్రలో తొలిసారి మనోళ్లకు 2 స్వర్ణాలు
X

అవును.. మనోళ్లు అదరగొట్టేశారు. చరిత్రలో తొలిసారి మన భారత చెస్ క్రీడాకారులు విదేశీ వేదిక మీద చెలరేగిపోయారు. దీంతో.. గతంలో ఎప్పుడు లేని విధంగా చెస్ ఒలింపియాడ్ లో భారత్ చెస్ క్రీడాకారులు హిస్టరీ క్రియేట్ చేశారు. ఈ ఈవెంట్ లో తొలిసారి 2 స్వర్ణాలు సాధించారు. బుడాపెస్ట్ లో జరిగిన 45వ చెస్ ఒలింపియాడ్ లో పురుషుల.. మహిళల జట్లు తొలిసారి స్వర్ణాలు సాధించాయి.

పురుషుల జట్టుకు సంబంధించి స్లోవేనియాతో జరిగిన 11వ రౌండ్ లోడి.గుకేశ్.. అర్జున్ ఇరిగేశీ.. ప్రజ్ణానందలు తమ గేమ్ లతో విజయం సాధించారు. వాద్లిమిర్ ఫెదోసీవ్ ను గుకేశ్ ఓడించారు. జాన్ సుబెల్జ్ పై ఇరగేశీ.. అంటన్ డెమ్చెంకో పై ప్రజ్ఖానంద విజయం సాధించారు. వాస్తవానికి టైటిల్ గెలిచేందుకు పురుషుల జట్టుకు 11వ రౌండ్ లో డ్రా సరిపోతుంది. మిగిలిన గేమ్ లలో ఓడినా స్వర్ణం ఖాయమైంది. తాజా టోర్నీలో పురుషుల జట్టు తొలి ఎనిమిది రౌండ్ లలో గెలిచి.. తొమ్మిది రౌండ్ ను డ్రాగా ముగించారు. కీలకమైన పదో రౌండ్ లో అమెరికాను మట్టి కరిపించారు. చివరిదైన పదకొండో రౌండ్ లో స్లోవేనియాపై పైచేయి సాధించారు. ఇలా పురుషుల జట్టు సంతోషకరమైన వార్తతో సిద్ధం కాగా.. అనూహ్య పరిణామం ఒకటి చోటు చేసుకుంది.

అదేమంటే.. భారత మహిళల జట్టు కూడా తొలిసారి బంగారుపతకాన్ని సాధించి రికార్డును క్రియేట్ చేశారు. 11వ రౌండ్ లో అజర్ బైజాన్ పై విజయం సాధించారు. హారిక.. దివ్య.. దేశ్ ముఖ్ లు తమ గేమ్ లలో విజయం సాధించగా.. ఆర్ వైశాలి మాత్రం డ్రాగా ముగించింది. వంతిక అగర్వాల్ మాత్రం అద్భుతమైన విజయాన్ని సాధించటంతో మహిళా జట్టు విజయాన్ని ఖాయం చేసుకుంది. దీంతో.. గతంలో ఎప్పుడూ లేని విధంగా రెండు స్వర్ణాలతో అదరగొట్టేశారు.