Begin typing your search above and press return to search.

సఫారీల్లో ఒకే ఒక్కడు... డెవిడ్ మిల్లర్ పేరున కొత్త రికార్డ్స్ ఇవే!

వన్డే ప్రపంచకప్ లో భాగంగా జరిగిన రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ లో అటు ఆస్ట్రేలియా, ఇటు సౌతాఫ్రికా రెండు జట్ల బౌలర్లూ బాగానే రాణించిన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   17 Nov 2023 4:19 AM GMT
సఫారీల్లో ఒకే ఒక్కడు... డెవిడ్  మిల్లర్  పేరున కొత్త రికార్డ్స్  ఇవే!
X

వన్డే ప్రపంచకప్ లో భాగంగా జరిగిన రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ లో అటు ఆస్ట్రేలియా, ఇటు సౌతాఫ్రికా రెండు జట్ల బౌలర్లూ బాగానే రాణించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సౌతాఫ్రికా చేసిన 213 పరుగుల్లో 101 పరుగులు డేవిడ్ మిల్లర్ సెంచరీలోవే కావడం గమనార్హం. ఇతడు కూడా రాణించకపోయి ఉంటే సఫారీ టీం పరిస్థితి మరింత దయణీయంగా ఉండేదనడంలో సందేహం లేదు! ఈ సమయంలో డేవిడ్ మిల్లర్ సఫారీ టీం లో ఒకే ఒక్కడుగా నిలిచాడు.. సరికొత్త రికార్డ్లు సృష్టించాడు!

అవును... ద‌క్షిణాఫ్రికా మిడిల్ ఆర్డర్ బ్యాటర్ డేవిడ్ మిల్లర్ చ‌రిత్ర సృష్టించాడు. వ‌న్డే ప్రపంచ‌క‌ప్ నాకౌట్ మ్యాచుల్లో సెంచ‌రీ చేసిన మొట్ట మొద‌టి సఫారీ బ్యాట‌ర్‌ గా రికార్డు నెలకొల్పాడు. తాజాగా వరల్డ్ కప్ సెమీఫైనల్ మ్యాచ్ లో భాగంగా కోల్‌ క‌తాలోని ఈడెన్ గార్డెన్స్‌ లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో కబరిచిన తనదైన పోరాట పటిమతో మిల్లర్ ఈ ఘ‌న‌త అందుకున్నాడు. ఈ మ్యాచ్‌ లో మిల్లర్ 115 బంతుల్లో సెంచ‌రీ చేశాడు.

ఇలా అత్యంత కీలకమైన మ్యాచ్ లో అత్యంత క్లిష్టమైన సమయంలో 116 బంతులు ఎదుర్కొన్న డేవిడ్ మిల్లర్... 8 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 101 ప‌రుగులు చేశాడు. ఈ క్రమంలో పలు రికార్డులు అత‌డి ఖాతాలో వ‌చ్చి చేరాయి. కారణం... 2015 వ‌న్డే ప్రపంచ‌క‌ప్ సెమీ ఫైన‌ల్ మ్యాచులో న్యూజిలాండ్ పై డుప్లెసిస్ చేసిన 82 పరుగులే ఇప్పటివరకూ అత్యుత్తమం.

2015లో క్వాలిఫైయిడ్ మ్యాచ్ లో శ్రీలంకపై క్వింటన్ డికాక్ 78 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచిన అనంతరం అదే ఏడాది న్యూజిలాండ్ పై జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ లో డుప్లెసిస్ 82 పరుగులు చేశాడు. నిన్నటివరకూ అదే సఫారీ బ్యాట్స్ మెన్స్ లలో ఈ లిస్ట్ లో టాప్ లో ఉండగా... తాజాగా ఈ వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియాపై మిల్లర్ చేసిన 101 పరుగులూ... ఈ జాబితాలో ఫస్ట్ కి చేరింది!

ఇదే క్రమంలో... ఆస్ట్రేలియా, ద‌క్షిణాఫ్రికా జ‌ట్లు త‌ల‌ప‌డిన మ్యాచుల్లో ఈ రెండు జట్ల నుంచీ అత్యధిక సెంచ‌రీలు చేసిన బ్యాట్స్ మెన్స్ జాబితాలో తాజాగా డేవిడ్ మిల్లర్ చోటు ద‌క్కించుకున్నాడు. ఈ జాబితాలో సఫారీల నుంచి డుప్లెసిస్, కంగారుల నుంచి డేవిడ్ వార్నర్ లు చెరో ఐదు సెంచ‌రీలు చేసి మొద‌టి స్థానంలో ఉన్నారు.

అనంతరం సఫారీల నుంచే డికాక్‌, గిబ్స్‌ త‌లా మూడు శ‌త‌కాలు బాది రెండో స్థానంలో నిలిచారు. ఈ క్రమంలో తాజా సెంచరీతో మిల్లర్ కూడా ఈ రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లలో అత్యధిక సెంచరీలు చేసిన జాబితాలో మూడు సెంచరీలతో డీకా, గిబ్స్ సరసన చేరాడు. ఈ లిస్ట్ లోని ఐదుగురిలో నలుగురు సౌతాఫ్రికా బ్యాటర్లే కావడం గమనార్హం.

ఇదే సమయంలో దక్షిణాఫ్రికా తరఫున వ‌న్డేల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాటర్స్ జాబితాలో రెండో స్థానానికి చేరుకున్నాడు డెవిడ్ మిల్లర్‌. ఇందులో భాగంగా సౌతాఫ్రికా మాజీ ఆల్ రౌండర్ జాక్వెస్ క‌లిస్ రికార్డును బ్రేక్ చేశాడు. ఈ జాబితాలో 200 సిక్స్ లతో ఏబీ డెవిలియర్స్ అగ్రస్థానంలో ఉండగా... నిన్నటివరకూ 137 స్కిక్స్ లతో కలిస్ రెండో స్థానంలో ఉండేవాడు.

తాజాగా లెక్కల ప్రకారం డేవిడ్ మిల్లర్ 138 స్కిల్స్ లు సాధించడంతో కలీస్ (137)ని వెనక్కి నెట్టి.. ఏబీ డెవిలియర్స్ తర్వాత స్థానంలో ఉన్నాడు. ఇక ఈ టాప్ 5 లో నాలుగోస్థానంలో 128 సిక్స్ లతో హెర్షల్ గిబ్స్, ఐదోస్థానంలో 118 సిక్స్ లతో క్వింటన్ డీకాక్ నిలిచారు. ఈ విధంగా తాజాగా ఈ వరల్డ్ కప్ లో ఆసిస్ తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ లో సెంచరీ సాధించడంతో మిల్లర్ ఇన్ని రికార్డుల్లో చోటు దక్కించుకున్నాడు!