ఢిల్లీ వర్సెస్ చెన్నై... పసికూన, కసికూన బలాబలాలివే!
ఇక ఇప్పటివరకూ ఈ రెండు జట్లూ 29 సార్లు తలపడగా... 10 మ్యాచ్ లలో ఢిల్లీ, 19 మ్యాచ్ లలో చెన్నై విజయం సాధించాయి.
By: Tupaki Desk | 31 March 2024 4:19 AM GMTఐపీఎల్ సీజన్ 17లో రిషబ్ పంత్ సారధ్యంలోని ఢిల్లీ డేర్ డెవిల్స్ పాయింట్ల పట్టికలో 9 ప్లేస్ లో నిలిచి పసికూనగా మారిన నేపథ్యంలో.. ఆడిన రెండు మ్యాచ్ లలోనూ గెలిచి టాప్ ప్లేస్ లో ఉన్న చెన్నై.. కసికూనగా చెలరేగిపోతోంది! ప్రత్యర్థి ఎవరనేది ఆ టీం కి బొత్తిగా అనవసరమైన విషయంగా మారిపోతుంది. కెప్టెన్ మారడం మినహా వారి పెర్ఫార్మెన్స్ లో ఏమాత్రం తేడా లేదు.. గ్రౌండ్ లో అదే జోరు.. స్టాండ్స్ లో అదే హోరు!
అవును... డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) ఐపీఎల్ - 2024 లోనూ తన జోరు కొనసాగిస్తుంది. ఈ సీజన్ లో ఇప్పటివరకూ ఆడిన రెండు మ్యాచ్ లలోనూ తన అధిపత్యాన్ని చూపించింది. సీనియర్లు, కుర్రాళ్ల కాంబినేషన్ లో ఆ జట్టు మరింత రాటుదేలినట్లు కనిపిస్తుంది. ఈ సమయంలో... ఈ రుతురాజ్ సేన ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ తో తలపడనుంది. ఈ రెండు జట్లకు మధ్య నేడు విశాఖ లో మ్యాచ్ జరగనుంది.
దీంతో... ఆడిన రెండు మ్యాచ్ లలోనూ ఓటమిపాలవ్వడంతో పాటు పోరాట పఠిమ కొరవడుతోందనే కామెంట్లు సొంతం చేసుకున్న ఢిల్లీ జట్టులో బలాలు చాలానే ఉన్నా.. అవి సరిగా వినియోగంలోకి రాకపోయే సరికి అవే బలహీనతలుగా మారుతున్న పరిస్థితి. ఫలితంగా ఫలితాలు తారుమారవుతున్నాయి. ఢిల్లీ బ్యాటింగ్ డిపార్ట్ మెంట్ లో వార్నర్, మిచెల్ స్టార్ట్, రికీ భుయ్, కెప్టెన్ రిషబ్ పంత్, పోరెల్, స్టబ్స్ అంటి వారిలో సగం మంది అయినా స్థాయికి తగ్గట్లు రాణించడం లేదు!
డెవిడ్ వార్నర్ తనదైన శైలిలో ఆరంభం అందిస్తున్నప్పటికీ.. దాన్ని కాపాడేవారు కరువవ్వడం అతిపెద్ద మైనస్! మరోపక్క మిచెల్ మార్ష్ నుంచి ఆశించిన పెర్ఫార్మెన్స్ ఇప్పటివరకూ దక్కలేదు. వీరంతా ఫాం లోకి రావాల్సిన మ్యాచ్ ఇది. ఇదే సమయంలో... బౌలింగ్ లో నార్త్ జే, ముఖేష్ కుమార్ లు చేతికి ఎములేదన్నట్లుగా పరుగులు ఇచ్చుకుంటున్నారు.. కుల్దీప్ కూడా కంట్రోల్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఇక చెన్నై విషయానికొస్తే... రచిన్ రవీంద్ర, శివం దుబె లు మాంచి ఫాం లోఉ ఉండటం.. కెప్టెన్ రుతురాజ్ మాంచి టచ్ లో ఉండటంతో పాటు.. హోప్ పెట్టుకునే బ్యాటర్స్ ఉండటం ప్లస్ గా ఉంది. చివర్లో ధోనీ ఉన్నాడనే ధైర్యం కూడా టాప్ ఆర్డర్ బ్యాట్ జులిపించేలా చేస్తుందనడం అతిశయోక్తి అయిన అంశం కాదు! ఇక బౌలింగ్ విభగానికొస్తే... ముస్తాఫిజుర్, రెమ్హాన్ లు లీడ్ చేస్తుండగా.. దీపర్ చాహర్, రానా లు రాణిస్తుండటంతో చెన్నైకి ఎదురులేకుండా పోతోంది. ఈ మ్యాచ్ లోనూ అదే పరిస్థితి కొనసాగుతుందా.. లేక, ఢిల్లీకి ఏమైనా మారుతుందా అనేది చూడాలి!
హెడ్ టు హెడ్:
ఇక ఇప్పటివరకూ ఈ రెండు జట్లూ 29 సార్లు తలపడగా... 10 మ్యాచ్ లలో ఢిల్లీ, 19 మ్యాచ్ లలో చెన్నై విజయం సాధించాయి. ప్రస్తుతం చెన్నై ఉన్న ఫాం ని బట్టి చూస్తే.. ఢిల్లీ రెట్టింపు ప్రయత్నం, రెట్టింపు పోరాటం చేయాలి. అలాకనిపక్షంలో హిస్టరీ రిపీటే!!