Begin typing your search above and press return to search.

రాహులో రాహులా.. నీ స్థానం సర్ఫరాజ్ కు పోయిందిరో

దీంతోనే అసలు అతడు జట్టులో అవసరమా? అనే ప్రశ్నలు వేస్తున్నారు అభిమానులు.

By:  Tupaki Desk   |   20 Oct 2024 3:15 AM GMT
రాహులో రాహులా.. నీ స్థానం సర్ఫరాజ్ కు పోయిందిరో
X

ఆడుతున్నది సొంత నగరంలో.. 31 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి జట్టు అత్యంత కష్టాల్లో ఉన్నప్పుడు క్రీజులో దిగాడు అతడు.. లెగ్ సైడ్ వెళ్తున్న బంతిని ఆడి డకౌటయ్యాడు. పోనీ మొదటి ఇన్నింగ్స్ లో పిచ్ బౌలర్లకు సహరించింది కాబట్టి వదిలేద్దాం అనుకుంటే..? రెండో ఇన్నింగ్స్ లో ఇంకా ఘోరం. జట్టుకు కాస్త సురక్షిత స్థితికి చేరి మెరుగైన ఆధిక్యం కోసం ప్రయత్నించాల్సిన సమయంలో అతడు విఫలమయ్యాడు. దీంతోనే అసలు అతడు జట్టులో అవసరమా? అనే ప్రశ్నలు వేస్తున్నారు అభిమానులు.

ఇంకా ఎన్నాళ్లూ..?

నిరుడు దక్షిణాఫ్రికాతో సిరీస్ లో సెంచరీ కొట్టాడు కేఎల్ రాహుల్. ఆ తర్వాత ఐపీఎల్ లో మెరుగైన ప్రదర్శనే చేసినా గాయంతో ఇబ్బంది పడ్డాడు. దీంతోనే టీమ్ ఇండియాకు దూరమయ్యాడు. శ్రీలంకతో వన్డే సిరీస్ కు తిరిగొచ్చినా అక్కడ విఫలం కావడంతో మూడో మ్యాచ్ కు తప్పించారు. ఇక బంగ్లాదేశ్ తో రెండు టెస్టుల్లో మోస్తరు ప్రదర్శనే చేశాడు. ఇప్పుడు న్యూజిలాండ్ తో తొలి టెస్టులో మాత్రం తేలిపోయాడు. తొలి ఇన్నింగ్స్ లో డకౌట్, రెండో ఇన్నింగ్స్ లో 12 పరుగులు మాత్రమే చేశాడు.

ఇంకా అవసరమా?

న్యూజిలాండ్‌ తో తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌ లో నాలుగో నంబరు బ్యాట్స్ మన్ సర్ఫరాజ్‌ ఖాన్ 150 పరుగులు చేశాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు భారీ సెంచరీ కొట్టాడు. వాస్తవానికి ఈ టెస్టులో సర్ఫరాజ్ కు తుది జట్టులో చోటు కష్టమే అనుకున్నారు. కానీ, శుభ్ మన్ గిల్ మెడ పట్టేయడంతో మ్యాచ్ కు దూరమయ్యాడు. సర్ఫరాజ్ కు అవకాశం దక్కింది. దీంతో కేఎల్‌ రాహుల్‌ ఖేల్ ఖతం అని సోషల్ మీడియాలో అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఇక రెండో టెస్టు నాటికి గిల్ ఫిట్‌ నెస్‌ సాధిస్తే తుది జట్టులోకి వస్తాడు. కచ్చితంగా వేటు రాహుల్ పైనే పడుతుంది.

ఆస్ట్రేలియా టూర్ కూ కష్టమే?

రాహుల్ ను వచ్చే నెలలో జరిగే ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపిక చేయడమూ కష్టమే. రాహుల్ కు ప్రత్యామ్నాయంగా మిడిలార్డర్ లో చాలామంది మెరుగైన ఆటగాళ్లున్నారు. వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ దులీప్, రంజీ ట్రోఫీల్లో సెంచరీలు చేశాడు. శ్రేయస్ అయ్యర్ కూడా ఉన్నాడు. రుతురాజ్ గైక్వాడ్ నూ పరిగణనలోకి తీసుకునే చాన్సుంది.