5.. 6.. 7.. ఐపీఎల్ లో రిటెన్షన్లు ఎన్ని? ఆ స్టార్ ప్లేయర్ల సంగతేంటి?
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తను ఎదుగుతూ జట్టును ఎదిగేలా చేసిన ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీని విడిచి పెడతాడనే ఊహాగానాలు వ్యాపిస్తున్నాయి.
By: Tupaki Desk | 27 Aug 2024 8:30 PM GMTఐపీఎల్ 17 సీజన్లు అయిపోయింది.. 18వ సీజన్ కు రాబోతోంది.. డిసెంబరులో మెగా వేలం జరగనుంది. ఈ దెబ్బకు ఆటగాళ్ల మార్పిడి భారీగా ఉంటుందనే కథనాలు వస్తున్నాయి. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తను ఎదుగుతూ జట్టును ఎదిగేలా చేసిన ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీని విడిచి పెడతాడనే ఊహాగానాలు వ్యాపిస్తున్నాయి. ఇక రోహిత్ ను కోల్ కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ రూ.50 కోట్లకు సొంతం చేసుకునేందుకు పోటీ పడుతున్నాయంటూ వార్తలు వచ్చాయి. ఇక వచ్చే ఐపీఎల్ -18లో మరో కీలకం అంశం ఆటగాళ్ల రిటెన్షన్.
సంఖ్య ఎంత..?
మొన్నటివరకు వినిపించినదాని ప్రకారం ఐపీఎల్ మెగా వేలానికి ముందు ఒక్కో జట్టు ఆరుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకునే అవకాశం ఉంది. అంటే, నేరుగా నలుగురిని, ఇద్దరు ఆటగాళ్లను ఆర్టీఎం ఆప్షన్ లో విడుదల చేయొచ్చు. కానీ, తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం ఆ సంఖ్య 5 అని తెలుస్తోంది. ఈ విషయం పంజాబ్ కింగ్స్ ట్విటర్ హ్యాండిల్ ద్వారా తెలిసింది. కానీ, అంతలోనే ఆ ఫ్రాంచైజీ దానిని తొలగించింది. పంజాబ్
రిటెన్షన్ జాబితాలో కేవలం ఐదుగురు ఆటగాళ్లే ఉన్నారు. అంటే రిటెన్షన్ ఐదుగురికే పరిమితమా? అనే చర్చ మొదలైంది.
మిగతా ఫ్రాంచైజీల మాటేమిటో?
కీలక ఫ్రాంచైజీలు వచ్చే ఐపీఎల్ సీజన్ కు ఆరుగురు లేదా ఏడుగురిని రిటైన్ చేసుకునే అవకాశం ఇవ్వాలని పట్టుబడుతున్నాయి. పంజాబ్ కింగ్స్ చెబుతున్నదాని ప్రకారం అయితే.. ఐదుగురికి పరిమితం అని తెలుస్తోంది. ఇదే నిజమైతే.. పెద్ద ఫ్రాంచైజీలు అంగీకరిస్తాయా? అనేది చూడాలి. ముఖ్యంగా, చెన్నై సూపర్ కింగ్స్ తమ స్టార్ ప్లేయర్ దిగ్గజ వికెట్ కీపర్ బ్యాటర్ ఎంఎస్ ధోనీని అన్ క్యాప్డ్ ప్లేయర్ గా ఉంచుకోవాలని చూస్తోంది. దీనికోసం ఆరు రిటెన్షన్ల ఆప్షన్ కోరుతోంది. తుది రిటెన్షన్స్ జాబితా 5కు పరిమితం చేస్తే.. టోర్నమెంట్‌లో టాప్ ఫ్రాంచైజీలు ఏ ఆటగాళ్ళను నిలబెట్టుకుంటాయో చూడాలి. ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ కొత్త జట్టులోకి వెళ్లడం దాదాపుగా ఖాయం అంటున్నారు. కోల్ కతా నైట్ రైడర్స్ హార్డ్ హిట్టర్ సూర్యకుమార్ యాదవ్ ను కెప్టెన్ గా సంప్రదించిందని చెబుతున్నారు. అటు రోహిత్, ఇటు సూర్య వెళ్లిపోతే ముంబైకి కష్టాలు మరింత పెరుగుతాయి.