Begin typing your search above and press return to search.

టీ20 వరల్డ్ కప్: ఆస్ట్రేలియాకు థాంక్స్ చెబుతున్న ఇంగ్లాండ్!

అయితే... కచ్చితంగా ఆస్ట్రేలియాకు ఇంగ్లాండ్ థ్యాంక్స్ చెప్పే మ్యాచ్ తాజాగా జరిగింది.

By:  Tupaki Desk   |   16 Jun 2024 10:25 AM GMT
టీ20 వరల్డ్  కప్: ఆస్ట్రేలియాకు థాంక్స్  చెబుతున్న ఇంగ్లాండ్!
X

ఆస్ట్రేలియా – ఇంగ్లాండ్ మధ్య క్రికెట్ ప్రపంచంలో ఉన్న వార్ సంగతి తెలిసిందే. ఈ రెండు దేశాల మధ్య యాష్ సిరీస్ జరుగుతుంటుంది. అయితే... కచ్చితంగా ఆస్ట్రేలియాకు ఇంగ్లాండ్ థ్యాంక్స్ చెప్పే మ్యాచ్ తాజాగా జరిగింది. ఫలితంగా.. టీ-20 వరల్డ్ కప్ లో లెక్కలు ఒక్కసారిగా మారిపోయాయి. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం..!

అవును... టీ20 వరల్డ్ కప్ లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ కు అదృష్టం కలిసొచ్చింది. ఈ టోర్నీలో అత్యుత్తమ రన్ రేట్ తో గ్రూప్ - బీ లో అస్ట్రేలియాతో పాటుగా సూపర్ - 8 కి అర్హత సాధించింది. వాస్తవానికి తొలుత నమీబియాపై ఘనవిజయం సాధించిన ఇంగ్లాండ్ రన్ రేట్ ను భారీగా పెంచుకుంది.. అనంతరం ఆసిస్ తో జరిగిన పోరులో స్కాంట్లాడ్ చేతులెత్తేసి ఇంటిముఖం పట్టింది.

ఇలా ఆస్ట్రేలియాపై స్కాంట్లాండ్ ఓటమితో ఇంగ్లాండ్‌ అనూహ్యంగా సూపర్ - 8లోకి చేరింది. వాస్తవానికి గ్రూప్-బిలో ఈ రెండు జట్లకూ సమానమైన పాయింట్లు ఉండగా.. నెట్ రన్ రేట్ కారణంగా ఇంగ్లాండ్ నెక్స్ట్ ఫైట్ దశకు చేరింది. అసలు కథ ఇంతవరకూ జరగడానికి కారణం... అంతకుముందు జరిగిన మ్యాచ్‌లో నమీబియాపై ఇంగ్లాండ్‌ విజయం సాధించడమే.

వాస్తవానికి ఈ టోర్నీలో ఇంగ్లాండ్ కు ప్రకృతి బాగా కలిసొచ్చింది. వర్షం కారణంగా 10 ఓవర్లకు కుదించబడిన మ్యాచ్ లో... తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లాండ్‌ ఐదు వికెట్లు కోల్పోయి 122 పరుగులు చేసింది. లక్ష్యఛేదనలో చతికిలపడ్డ నమీబియా మూడు వికెట్లు నష్టపోయి 84 పరుగులే చేయగలిగింది. దీంతో 41 పరుగుల తేడాతో ఓటమి మూటగట్టుకుంది.

ఇదే క్రమంలో... వర్షం కారణంగా అప్పటికే స్కాట్లాండ్‌ వర్సెస్‌ ఇంగ్లాండ్‌ మ్యాచ్‌ రద్దయింది. వాస్తవానికి నమీబియాతో మ్యాచ్ కూడా వర్షం కారణంగా పూర్తిగా రద్దయితే ఇంగ్లాండ్‌ ఇంటి బాట పట్టడం ఖాయమయ్యేది. కానీ వరుణుడు సగం సహకరించడంతో ఎట్టకేలకు పది ఓవర్ల మ్యాచ్‌ ఆ జట్టును గట్టెక్కించింది!

ఫలితంగా గ్రూప్-బిలో ఇంగ్లాండ్, స్కాంట్లాడ్ లు తలో ఐదుపాయింట్లూ సాధించింది. అయితే ఇంగ్లాండ్ నెట్ రన్ రేట్ +3.611 కాగా.. స్కాట్లాండ్ నెట్ రన్ రేట్ +1.255 గా నిలిచింది. దీంతో... అదృష్టం ఇంగ్లాండ్ ను వరించింది.